
వరంగల్ (పిఎఫ్ ప్రతినిధి): వరంగల్ ఉప ఎన్నికలే లక్ష్యంగా జిల్లాలోన అన్ని పార్టీలు వ్యూహాలను పదును పెడుతున్నాయి. వరంగల్ లో ఎలాగైనా విజయం సాధించి జిల్లాలో ఎలాగైనా బలపడాలని అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ లోక్ సభ ఉపఎన్నికల వివరాలను ఇప్పటికే ఎన్నికల అధికారి వెలువరించారు. దీంతో అన్ని పార్టీలు తమ బలాబలాలకంటే ఇతర పార్టీల బలహీతనలకే అధిక ప్రాధాన్యాన్నిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా టిఆర్ఎస్, టిడిపి, బిజెపి పార్టీల మధ్య పోటీ నెలకొననుంది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అభ్యర్థుల ఎన్నికల్లో సైతం పార్టీలు జాగ్రత్తలు వహిస్తున్నాయి. టిడిపి, బిజెపిలు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించి అధికార పార్టీపై ఒత్తిడిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం పలు వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్ రూం ఇండ్ల లాంటి అభివృద్థి పథకాలను ప్రవేశపెట్టి ఒక విధంగా బలంగానే ఉంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడే వరకు విజయం ఎవరిని వరిస్తోందో అని ఊహాగానాలకు పదునుపెడూ వేచి చూడాల్సిందే!!