వరంగల్ ఉపఎన్నిక: గెలుపు ఎవరిదంటే..?

వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసిపోయింది. చివరి రోజు టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు మీడియా ముందుకు వచ్చి చకచకా మట్లాడేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలపై దుమ్మెత్తిపోశారు. కడియం, హరీష్ లు మాటల తూటాలు పేల్చారు.

నిన్న హైదరాబాద్ లో జైపాల్, జానాలు తెలంగాణ పై, కేసీఆర్ అబద్దపు దీక్షపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో చివరిరోజు ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపుపై ఎవరి ధీమా వారికుంది. కానీ గెలుపెవరదనేది వరంగల్ ఓటరు మదిలోంచి తొంగిచూస్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది.

ఓరుగల్లులో గెలుపెవరది.?

సర్వేలు, ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి క్షేత్రస్థాయిలో చూస్తే టీఆర్ఎస్ గెలుపు వరంగల్ లో లాంఛనమేనన్న టాక్ వినపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకులను బరిలోకి దించి విస్తృతంగా ప్రచారం చేసినా.. టీఆర్ఎస్ పథకాలే ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బూస్ట్ లా కనపడుతున్నాయి.. ముఖ్యంగా పించన్లు, రేషన్ కార్డులు (6 కిలోలు వ్యక్తికి), కళ్యాణలక్ష్మీ,ఆరోగ్యలక్ష్మీ, నిరంతర విద్యుత్ సరఫరా, ఇతర సంక్షేమ పథకాలు జనంలోకి బాగా వెళ్లాయి.. అర్హులందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. కొంచెం రైతుల పరిస్థితే వానలు లేక దయనీయంగా ఉన్న వారు కూడా ప్రకృతినే తిడుతున్నారు. ఇంత కష్టకాలంలో కూడా కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ పాలనను మెచ్చుకుంటున్నారు..

ఇక కాంగ్రెస్ గెలుపు స్థానికేతర అభ్యర్థి సర్వేతో కొంత వెనుకబడింది. టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విభేదిస్తున్న కాంగ్రెస్ పార్టీ దానికి తగిన కారణాలను చూపట్టలేకపోతోంది. కేసీఆర్ నియంత, అసమర్థుడు, మోసకారి అంటూ విమర్శలు చేస్తున్నా సహేతుక కారణాలు మాత్రం కాంగ్రెసోళ్లు చెప్పడం లేదు.. ఎంతసేపు పాలనను నిందించడం తప్పితే లోటుపాట్లపై ఎత్తిచూపడం లేదు. ఇదే కాంగ్రెస్ ఓటమికి కారణంగా కనపడుతోంది. కేసీఆర్ వచ్చి పథకాల లిస్ట్ చాంతడంత చెపుతుండా.. అందులో కనీసం ఒక్కదానిపై కూడా కాంగ్రెస్ ఇది బాగా లేదని చెప్పడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేసి చేస్తున్న రాజకీయంలో కాంగ్రెస్ కు ఓటమే ఎదురయ్యే అవకాశాలున్నాయి..

జనం కేసీఆర్ ను , ఆయన గుణగణాల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. తమకు కరెంట్ వస్తుందా.. పథకాలు పింఛన్లు, రేషన్ అందుతుందా అని మాత్రమే చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పాచిక.. తెలంగాణ ఇచ్చామన్న ఘనతను జనాలు పట్టించుకోవడం లేదు..

ఇక బీజేపీ-టీడీపీ క్యాండిడేట్ కు 3వ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీకి కేడర్, ఆంధ్రాపార్టీ అన్న ముద్ర జనంలో ఉండడమే ఈ ఓటమికి కారణం. పైగా చంద్రబాబు ఈసారి వరంగల్ లో ప్రచారం చేయలేదు. ఆయనే దూరంగా ఉండేసరికి ఇక నాయకులు పట్టించుకోలేదు. దీంతో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కతే గొప్పే..

మొత్తానికి ఓరుగల్లులో గులాబీ పరిమళమే వీచనున్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *