
జిల్లలలో గల సహజ వనరులను సద్వినియోగంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. మంగళవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాల అమలుపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఏదో ఒక రంగంలో అభివృద్ధి చేయుటకు అవకాశాలను గుర్తించాలని సూచించారు. జిల్లా మండల కేంద్రాలలో కొత్తగా కాలేజీలు, పాఠశాలలు, వసతి గృహలు నిర్మించుటకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హమీ పధకం ద్వారా గ్రామాలలో కూలీలందరికి పనులు కల్పించాలని సూచించారు. గ్రామాలలో , పట్టణాలలో బాల కార్మికులను నిర్మూలించాలని, మూడ నమ్మకాలను నమ్మకుండ ప్రజలను చైతన్యవంతులను చేయాలని అన్నారు. పేద ప్రజలు పిల్లల ని పాఠశాలలలో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేలా చూడాలని అన్నారు. జిల్లాలలో చిన్న మద్యతరహ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించి చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. యువతకు వృత్తి నైపుణ్యత పెంపొందిచుటకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండ తగిన చర్యలు గైకొనాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ నగదు రహిత సమాజ నిర్మాణానికి కృషి అన్నారు. వచ్చే సంవత్సరం హరిత హరంలో మొక్కలు నాటుటకు నర్సరీలను పెంచుట ప్రారంభించాలని అన్నారు. నాటిన మొక్కలన్ని బతికేలా చూడాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్
సర్పరాజ్ అహ్మద్ డిఆర్ డిఒ వెంకటేశ్వర్లు ఫారెస్టు కన్వీర్వేటర్ ఆనంద్ మోహన్ సిపిఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.