Breaking News

వధువు తెలంగాణ అయితే చాలు

Kalyana-Lakshmi-Scheme

హైదరాబాద్, ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి పథకంలో అధికారులకు ఒక కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం
51 వేల ఆర్థికసాయం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు ఈ పథకం కింద అధికారులు 30 వేల
దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా కేవలం 2 వేలే వచ్చాయట. ఇక పెళ్లి సంబంధాల విషయంలోను కొత్త చిక్కొచ్చి పడింది. అందేంటంటే.. వధువు తెలంగాణ అయ్యుండి వరుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే (ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక) కళ్యాణ లక్ష్మి వర్తిస్తుందా అని దీనిపై కిందిస్థాయి అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించారట.. అయితే వధువు తెలంగాణ అమ్మాయి అయితే చాలు పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు..

కాగా మన తెలంగాణలో ఎక్కవుగా మహబూబ్ నగర్ వాసులు కర్నూలు (ఏపీ), గుల్బర్గా(కర్ణాటక) వాసులతో పెళ్లిసంబంధాలు కుదుర్చుకుంటారు. అలాగే నల్గొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగూడ వాసులు కృష్నా, గుంటూరు వాసులతో అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని కెరిమెరి, నిర్మల్ ప్రాంతాల వారు మహారాష్ట్ర వాసులతో.. మెదక్ లోని వారు కంగ్డి ( కర్ణాటక) వాసులతో ఎక్కవగా సంబంధాలు కలుపుకుంటారు. దీంతో ఈ ప్రాంత యువతలక ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి అర్హులు కానున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *