వడగండ్ల బాధిత రైతులను ఆదుకోవాలి.

-వైైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాశరావు

కరీంనగర్ : వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని  వైెఎస్సార్పీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాశ రావు డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగర్ జిల్లా లోనే రాష్ట్రంలోకెల్ల ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నష్టోపోయిన రైతుల పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లాలో పర్యటించి పంట నష్టపోయిన రైతులను ఓదార్చాడని.. నష్టోపోయిన రైతులు ఆ సమయంలో బోరున విలపించారని ఆయన అన్నారు. రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే  రైతులకు మేలు జరిగిందన్నారు. రైతులకు ఎటువంటి బాధ కలుగకుండా రాజశేఖర్ రెడ్డి ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత  తెలంగాణకు మేలు జరుగుతుందని కేసీఆర్ పై ఆశలు పెట్టుకున్న ప్రజలకు అడియాసలయ్యాయన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్పీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కరీంనగర్  జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర  కార్యదర్శి  బోయినపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి డా. నగేశ్, జిల్లా  ప్రధాన కార్యదర్శి కొళ్ళు అజయ్ వర్మ,బొగె పద్మ, ముసుకు వెంకటరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తందమల్ల నరేశ్,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు దేవరనేని వేణుమాధవరావు, జిల్లా అధికార ప్రతినిధి వరాల శ్రీనివాస్,బండమీది అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *