
సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడిత చీకట్లోనే బతుకుతారని ఎద్దేవా చేశాడు.. కానీ ఇప్పుడేమైంది.. తెలంగాణలో వెలుగులతో విరజిమ్ముతోంది.. నిరంతర కరెంటుతో సమైక్యవాదులకు చెంపపెట్టులా నిలుస్తోందన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ గోల్కొండలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే కరెంటు కష్టాలన్నారు. కానీ నేడు నిరంతరం సరఫరాతో టీఆర్ఎస్ ప్రభుత్వం సత్తా చాటుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణను ఏమీ చేయాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోందని.. కేవలం వాటర్ గ్రిడ్ కోసం హడ్కో, వాటర్ పవర్ కార్పొరేషన్ 91 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి అవార్డులు కూడా ఇస్తున్నారని కేసీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి ఫలాలను కేసీఆర్ వివరించారు. ప్రపంచంలోనే మెరుగైన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టామని.. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని.. ఏకంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమే తెలంగాణ ప్రభుత్వాన్ని సదస్సు కు చైనా ఆహ్వానించిందని కేసీఆర్ చెప్పారు. వాటర్ గ్రిడ్ కు నిధుల వరద పారుతోందని.. మైక్రో ఇరిగేషన్ 900 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. సమైక్య పాలనలో గోదావరి, కృష్ణ నదుల్లో మన నీళ్ల వాటా కాగితాలకే పరిమితమైందని…. నీళ్ల లేక నష్టపోయమని.. ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టుల్లో మన నీటిని మనం తెచ్చుకొని అభివృద్ధి చెందుదామన్నారు.