వచ్చే నెలలో చైనాకు ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఐదేళ్లలో రికార్డు సృష్టించింటట్టే కనపడుతున్నారు. గద్దెనెక్కిన కొద్ది కాలంలోనే నెలకు రెండు దేశాలు చుట్టివస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడా పర్యటనలు ముగించుకొని వచ్చిన ప్రధాని వారం తిరక్కుండానే మరో పర్యటనకు ముహూర్తం ఖరారు చేశారు.

ప్రధాని మోడీ పర్యటన మే 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు జరుగనుందని పీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పర్యటన ఖరారు అయ్యిందని ఉన్నతాధికారులు తెలిపారు. చైనాతో ద్వైపాక్షిక , పారిశ్రామిక రంగాల పెట్టుబడులపై చర్చిస్తారని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *