Breaking News

వచ్చే జూన్ లోపే రాజేంద్రనగర్ లో అత్యాధునిక ISTA విత్తన పరీక్షా కేంద్రం

వచ్చే జూన్ లోపే రాజేంద్రనగర్ లో అత్యాధునిక ISTA విత్తన పరీక్షా కేంద్రం

తెలంగాణ రాష్ట్ర విత్తన,సేంద్రీయ ధృవీకరణ అథారిటి పాలక మండలి సమావేశం
తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటి 7వ సాధారణ పాలక మండలి సమావేశం శ్రీ సి.పార్థ సారథి, IAS వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి గారి అధ్యక్షతన ఈ రోజు సంస్థ యొక్క సమావేశ మందిరంలో జరిగింది. ఈ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి సభ్యులైన వ్యవసాయ శాఖ కమిషనర్ డాII జగన్ మోహన్,IAS, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీ వెంకట్రామి రెడ్డి, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ కె. ధర్మయ్య, వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాII టి.ప్రదీప్, విత్తన పరిశోధన సాంకేతికత కేంద్రం డైరెక్టర్, డాII నగేష్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శివ కుమార్, జాతీయ విత్తనాభివృధ్ధి సంస్థ (NSC Ltd) ప్రాంతీయ మేనేజరు (ఆర్‌ఎం) సుధాకర్, ప్రివేటు విత్తన ఉత్పత్తిదారుల ప్రతినిధులు హరీష్ రెడ్డి, రమణ రావు, విత్తన రైతు ప్రతినిధి కొట్టాల చిన్నా రెడ్డి పాల్గొన్నారు.

రాజేంద్రనగర్ లో నిర్మాణంలో ఉన్న ISTA ల్యాబ్ ను అత్యాధునిక పరికరాలతో సహా వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని, GOT ఫార్మ్ ను జూన్ నాటికి సిద్దం చేయాలని ఆదేశించారు. నకిలీ ట్యాగుల తయారీకి వీలుకాని టైవెక్ ట్యాగులను అన్నిపంటలకు అందించాలని నిర్ణయించారు. సహకార రంగంలో ధృవీకరణ విత్తనోత్పత్తిని ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. నాణ్యమైన ధృవీకరణ పశుగ్రాస విత్తనోత్పత్తిని చేపట్టాలని కూడా నిర్ణయించారు. అంతర్జాతీయ OECD విత్తన ధృవీకరణలో నైపుణ్యాభివృద్ధికై విదేశాలకు సాంకేతిక సిబ్బందిని పంపించాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. APEDA నుండి తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ ధృవీకరణ అథారిటికి అతీత్వరలో Accreditation రానున్న దృష్ట్యా సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణను ఎక్కువ ప్రాచూర్యంలోకి తెచ్చి పెద్దమొత్తంలో చేపట్టాలని నిర్ణయించింది. సంస్థకు సంబందించిన 2017-18 విత్తన ధృవీకరణ ప్రణాళికను, వివిధ పద్దులను పాలక మండలి ఆమోదించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *