Breaking News

వచ్చే ఏడు నుంచి అందరికీ కళ్యాణలక్ష్మీ

KCR

సీఎం కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికలకు ముందు మరో భారీ పథకాన్ని ప్రకటించారు. బహుశా ఎన్నికల ముందు ఆకట్టుకోవడానికి పథకం ప్రవేశపెట్టినా అది అందరికీ చాలా మేలు చేసేదే..

దయాకర్ కు వరంగల్ లోక్ సభ బీం ఫామ్ ఇచ్చే సభలో కేసీఆర్ మాట్లాడారు. వచ్చే సంవత్సరం నుంచి అందరికీ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ ఈ పథకం అమలు చేసి సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృసి చేస్తానని కేసీఆర్ చెప్పారు.

ఒక వేళ కళ్యాణలక్ష్మీ అందరు పేదలకు అమలైతే తెలంగాణ లో మరో పదేళ్ల ఆయనే అధికారం చేపట్టే పెద్ద పథకం అవుతుందని టీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *