వచ్చే ఏడాది చైనాను అధిగమిస్తాం..

హైదరాబాద్ : నరేంద్ర మోడీ పాలన పగ్గాలు చేపట్టిన వేళా విశేషం ఏంటో కానీ భారత్ వృద్ధి రేటు రేసుగుర్రంలా పరిగెడుతోంది. ఎన్నడూ లేనంత స్పీడుగా దౌడుతీస్తోంది. ఇన్నాళ్లు ప్రపంచవ్యాప్తంగా చైనా డ్రాగన్ ఆదిపత్యమే కొనసాగేది.. అమెరికాకు సైతం గట్టి పోటీనిచ్చిన చరిత్ర చైనా డ్రాగన్ కు ఉంది. అటు వంటి చైనాను భారత్ రెండోస్థానంలోకి నెట్టి ఆర్థికాభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచింది.  2015-16లో భారత్ చైనా వృద్ధిరేటును అధిగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఏంఎఫ్) స్వయంగా పేర్కొనడం సానుకూలాంశం.

కాగా భారత్ వృద్ది రేటు పరుగులు తీయడానికి  మోడీ సంస్కరణలతో పాటు.. అంతర్జాతీయంగా అనుకూల మైన పవనాలు కూడా వీచాయి. ముఖ్యంగా చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరాయి. దీంతో ప్రజల చేతిలో డబ్బులు మిగిలి కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను మోడీ ప్రభుత్వం బాగా ఆకర్శించింది. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. మేకిన్ ఇండియా నినాదంతో ఇండియా వృద్ధి గణనీయం పెరిగేలా ప్రభుత్వం పథక రచన చేసింది. దీంతో వచ్చే ఏడాది చైనాను ఖచ్చితంగా భారత్ అధిగమించి ప్రపంచంలో అభివృద్ది చెందిన దేశంగా అవతరించబోతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *