
గుంటూరు జిల్లాలో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చిన వపన్ ఈ సందర్బంగా టీడీపీ వైఖరిపై మండిపడ్డారు. రైతుల భూములను లాక్కుంటున్న టీడీపీ ప్రభుత్వం ఒక వేళ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే భూములు కోల్పోయిన రైతులకు ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీలు ఏపీకి న్యాయం చేస్తారనే మద్దతు ఇచ్చానని.. కానీ టీడీపీ మంత్రులు వ్యవహారశైలి చూస్తుంటే ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఫ్యూచర్ ఆలోచించకుండా భూములు లాక్కుంటోందని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
అభివృద్ధికి నిరోధకుడు అని టీడీపీ మంత్రులు విమర్శిస్తున్నారని.. మరి ఎన్నికల ముందు తాను టీడీపీకి ఎందుకు మద్దతిచ్చానని ఆ మాటపై సమాధానం ఇవ్వాలని పవన్ ప్రశ్నించారు.