వచ్చేసారి చేయి చాపాల్సిందే మోడీ..

Modi_AmitShah_519617532

పాట్నా : 2014 ఎన్నికల్లో ఒంటి చేత్తో బీజేపీని గెలిపించి వేరొకరి అవసరం లేకుండా గద్దెనెక్కిన ప్రధాని మోడీకి మున్ముందు పరిస్థితులు అలా ఉండేలా కనిపించడం లేదు.. ఇందుకు మోడీ ఒంటెద్దు పోకడలు, ఎవరి అవసరం తనకు అవసరం లేదనే అహమే కారణం. కేంద్రం బీజేపీ అధికారంలోకి రాగానే మోడీ ఇక తనకు ఎదురలేదని అందరినీ కాలదన్నారు. మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదు..

అటూ మహారాష్ట్రలో శివసేనతో, ఇటు ఏపీలో టీడీపీతో కూడా మోడీకి సఖ్యత లేదు.. చంద్రబాబు తనకు ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా ఏపీ కి చేసిన అన్యాయానికి బదులు తీర్చుకుందామని గోతికాడ నక్క వలె ఎదురుచూస్తున్నాడు. శివసేన కూడా ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని ఓడించి కార్పొరేషన్ కైవసం చేసుకుంది.

అటు  బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తో మోడీ-అమిత్ షాలకు ఈసారి చుక్కలు చూపించారు ఓటర్లు.. వారి ఆదిపత్యానికి , బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారు. అహంకార పూరిత పరిపాలను తగిన గుణపాఠం చెప్పారు.

ఇప్పుడు మోడీకి ప్రాంతీయ పార్టీలే దిక్కవుతాయి.. టీడీపీ, టీఆర్ఎస్, జయ ఏఐడీఎంఏ, జేడీయూ, తదితర పార్టీల మద్దతు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి.. లేకపోతే గెలుపు సాధ్యం కాదు.. దీనంతటికి మోడీ ఏకచ్ఛత్రాధిపత్యమే కారణం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *