వచ్చేవారం రేవంత్ కేసు మలుపు తిరగనుందా.?

హైదరాబాద్ : వచ్చేవారం ‘ఓటుకు నోటు కేసు’ మలుపుతిరగనుంది. పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ వచ్చేవారమే కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మాట్లాడిన ఆడియో, రేవంత్ వీడియో టేపులను ఫోర్సెనిక్ ల్యాబ్ లకు పంపారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టు , విచారణలో రేవంత్, సహ నిందితులు చెప్పిన విషయాలను కలగలపనున్నారు. అనంతరం ఫిర్యాదు దారు స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని కూడా ఈ సందర్భంగా మెజిస్టేట్ ముందు నమోదు చేయడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

దీంతో వచ్చేవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు కేసులో విచారించేందుకు నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం.  ఆ తర్వాత కేసు ముదిరితే ఆయన రాజీనామా కూడా చేయాల్సి వస్తుందని పరీశీలకులు భావిస్తున్నారు. రేవంత్ కేసులో మొత్తానికి వచ్చే వారం జరిగే పరిణామాలే కీలకంగా మారనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *