వచ్చేఏడు నుంచి కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యం

hastel

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మరో గొప్పనిర్ణయం తీసుకున్నారు. వచ్చే వద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ హాస్టళ్లు, యూనివర్సిటీ హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యంతో వండిన అన్నం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఇందుకోసం నిధులు కూడా కేటాయించినున్నట్టు వెల్లడించారు.

ఇప్పటికే రాష్ట్రంలోని హాస్టళ్లలో భోజనానికి మధ్యాహ్న భోజన పథకానికి రూ.700కోట్లు వెచ్చించి సన్నబియ్యం అందిస్తున్నారు సీఎం కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఇక కాలేజీల్లో చదివుతున్న విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి.

ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలు చెల్లించాలని సీఎం నిర్ణయించి విద్యార్థుల రుణం తీర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థులు మెస్ బిల్లులు 2005 నుంచి 2014 వరకు సుమారూ రూ.7 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని మొత్తం ఒకేసారి చెల్లించాలని కేసీఆర్ నిర్ణయించడం విద్యార్థుల పాలిట వరమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *