
తెలంగాణ రాష్ట్రం లోని వక్ఫ్ బోర్డ్ భూములను పరిరక్షించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు అన్నారు. సోమవారం సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదాపూర్ లోని గుట్టలబేగంపేట్ లోని 91 ఎకరాల వక్ఫ్ భూములను గతంలోనే వక్ఫ్ బోర్డ్ గుర్తించి అవి వక్ఫ్ బోర్డ్ భూములన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం లోని భాగంగా గుట్టలబేగంపేట్ మస్జీద్ ని సందర్శించినప్పుడు కేసీఆర్ గారు వక్ఫ్ బోర్డ్ భూములను పరిరక్షించాలని చెప్పిన అంశాన్ని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు గుర్తు చేశారు. ఈ భూముల పై న్యాయ స్దాన పరిధిలో వుంది. అయిన కొందరు వ్యక్తులు వక్ఫ్ బోర్డ్ భూములను కబ్జా చేస్తున్నారని,సంబంధిత అధికారులు అప్రమత్తంగా వుండి కబ్జాదారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,వెంటనే అక్కడ జరుగుతున్న నిర్మాణాలను నిలపివేయలని అధికారులను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు ఆదేశించారు.
ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ గారు,ప్రభుత్వ సలహాదారుడు ఏ కె ఖాన్ గారు,వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు mlc సలీమ్ గారు, మైనార్టీ సెక్రటరీ దాన కిషోర్ గారు,వక్ఫ్ బోర్డ్ సీఈఓ మన్నాన్ గారు, మాదాపూర్ డీసీపీ,సిఐ పాల్గొన్నారు.