ల్యాంకోకు మళ్లీ అప్పులిచ్చిన బ్యాంకులు

హైదరాబాద్ : బ్యాంకుల్లో రుణాలు తీసుకుని చెల్లించకపోతే ఏం చేస్తారు ? ముక్కు పిండి వసూలు చేస్తారని అని ఠక్కున చెబుతారు. మరి అదే సంపన్న వర్గాలకు చెందిన వారు రుణాలు తీసుకుంటే బ్యాంకులు ఏం చేస్తాయి ? ఏమీ అనవు. మళ్లీ అప్పులు కావాలని అడిగితే వెంటనే ఇచ్చేస్తారు. వివిధ ప్రాజెక్టు కోసం 49వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ల్యాంకో గ్రూపు ఇందకు నిదర్శనం. అప్పుల ఊబిలో కూరుకపోయిన ల్యాంకోకు వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు మరింత రుణ సహాయం చేయడానికి బ్యాంకులు ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పది బ్యాంకుల నుండి 49వేల కోట్లు..
పలు ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ల్యాంకో గ్రూపు ఒప్పుకుని అందుకు పది బ్యాంకు లనుండి 49 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రాజెక్టులు పూర్తికాలేదు. దీనితో ఆ అప్పులను సకాలంలో చెల్లించలేదు. అయితే ఆ అప్పులు ఎలా రాబట్టుకోవాలని బ్యాంకులు ఆలోచించాయి. వెంటనే త్రిసభ్య కమిటి ఒకటి ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ ల్యాంకో ఎక్జిక్యూటివ్స్ తో కలిసి సమావేశం నిర్వహించి ఒప్పందం కుదుర్చుకుంది. తీసుకున్న అప్పులు తీర్చడానికి కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులు అమ్మాలని నిర్ణయించారు. అసంపూర్తిగా మిగిలి పోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆ ప్రాజెక్టు కయ్యే ఖర్చులో 80 శాతం రుణ సహాయం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే ల్యాంకోకు చెందిన ఉడిపి పవర్ ప్రాజెక్ట్ ను 6 వేల కోట్లకు అదాని పవర్ ప్రాజెక్ట్ తో బేరం కుదిరింది. నగదు రూపంలో 925 కోట్లు వచ్చినా అది ఏ మూలకూ సరిపోదు. ఈ నేపథ్యంలో ల్యాంకోకు బ్యాంకులు మరింత రుణ సహాయం చేయాలనుకోవడం ఎంతవరకు సబబనే విమర్శలు వస్తున్నాయి.
నోరు మెదపని రిజర్వు బ్యాంకు..
ఆర్థిక సరళీకృత విధానాలు అనుసరిస్తున్న పాలకులు కార్పోరేట్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో నానా షరతులు పెట్టిన రిజర్వ్ బ్యాంక్- ల్యాంకో గ్రూప్ అప్పులు చెల్లించే విషయంలో మాత్రం నోరు మెదపక పోవడం పక్షపాత వైఖరికి నిదర్శనం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.