లొల్లి వద్దు.. పోతే నిరసన తెలిపి పోండి

kcr

సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నచ్చితే ఉండండి.. లేకపోతే నిరసన తెలిపి బయటకు పోండి.. అని విపక్షాలపై మండిపడ్డారు. బడ్జెట్ పై అందరూ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని అయితే కొందరు పనిగట్టుకొని విమర్శలు చేశారని మంత్రి ఈటెల రాజేందర్ పరోక్షంగా నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ వారించినా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడిసే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ మైక్ ఇవ్వాలనుకుంటేనే మైక్ ఇస్తారని.. మీకు నచ్చినప్పుడు మైక్ ఇవ్వరన్నారు. నచ్చితే సభకు సహకరించండి.. లేదా నిరసన తెలిపి వెళ్లిపోండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెళ్లిపోండి అని అనలేదని కేసీఆర్ వివరణ ఇ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *