లొంగి పోయిన నక్సలైట్ కు ఆర్దిక సహయం

పెద్దపల్లి మండలం నిమ్మపల్లికి చెందిన లొంగిపోయిన మావోయిస్టు కాంపల్లి నంబయ్య అలియాస్ నవీన్ కు ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఒక లక్ష రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ వి.శివకుమార్ బుధవారం నాడు అందజేశారు. మావోయిస్టు నంబయ్య గత సంవత్సరం జూన్ 25న కరీంనగర్ లో జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్ కు ప్రభుత్వం అందజేసే ఆర్దిక సహయంతో పాటు పునరావాసం కల్పించడం జరుగుతుందని ఎస్పీ వి.శివకుమార్ తెలిపారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాల్లో ఉన్న అజ్ఞాత నక్సల్స్ వనవాసానికి స్వస్తి చెప్పి జనజీవనంలోకి రావాలని కోరారు. నక్సల్స్ ఉనికి చాటుకోవడం కోసం ప్రజాప్రభుత్వ ఆస్తులను బుగ్గిపాలు చేయడం, అమాయకులను హతమార్చి వారి కుటుంబసభ్యులను అనాధలను చేయడం తప్ప సాధించింది ఏమి లేదని, భవిష్యత్ లో సాధించబోయేది కూడా ఏమీ ఉండదని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలో కలిసే అజ్ఞాత తీవ్రవాదులు ప్రభుత్వం అందజేసే ఆర్దిక సహయం, పునరావాస చర్యలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నక్సల్స్ కదలికల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచి వారికి నగదు పారితోషికాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి ఎల్.సుబ్బరాయుడు. ఎస్ ఐబి ఇన్స్ పెక్టర్ యం.డి సర్వర్ తదితరులు పాల్గొన్నారు. 8మంది హెడ్ కానిస్టేబుళ్ళకు ఎఎస్ ఐలుగా పదోన్నతి జిల్లాలో ఎనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్ళకు ఎఎస్ ఐలుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీ వి.విశివకుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. జి.ప్రసాదరావు(వీణవంక), సంకెడి లక్ష్మారెడ్డి(విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్), విష్ణుమూర్తి(ముత్తారం), ఓకంటి భూపతిరెడ్డి(ధర్మారం), మాసం సత్తయ్య(ఇంటెలీజెన్స్), మోట ఆంజనేయులు(కొడిమ్యాల), మామిడి మధుసూధన్ రావు (డిటిఆర్ బి, కరీంనగర్)

About The Author

Related posts