
ముంబై, ప్రతినిధి : చానాళ్ల తర్వాత బిపాసా తన అందాలతో కుర్రాకారుని మత్తెక్కిస్తోంది. ఇటీవల బిపాసాబసు లేటెస్ట్ మూవీ ‘ఎలోన్’ ట్రైలర్‌కి నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్, హారర్ తరహాలో రానున్న ఈ చిత్రంలో బిపాసా ఓ రేంజ్ లో అందాలను ఆరబోసిందట.. సహనటుడు కరణ్‌సింగ్‌తో బిపాసా పాల్గొన్న హాటెస్ట్, బోల్దేస్ట్ సీన్స్ ఇందులో బోలెడన్ని ఉన్నాయని ప్రచారం సాగుతోంది. రీసెంట్గా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో విడుదల చేశారు.
కేవలం పది రోజుల్లోనే 46 లక్షల హిట్స్ రావడంతో యూనిట్ ఖుషీగా వుంది. ట్రైలర్ గురించి బిపాసా తన ట్విటర్లో రాసుకొచ్చింది. యూట్యూబ్ పాపులర్ వీడియోల్లో ఈ ట్రైలర్ కూడా ఒకటని, దాదాపు నాలుగు మిలియన్లు వ్యూస్ వచ్చాయని తెలిపింది. చాన్నాళ్లు తర్వాత తన చిత్రానికి ఈ రేంజ్లో నెటిజన్ల నుంచి స్పందన రావడంతో హ్యాపీగా ఫీలవుతోంది.
కథ విషయానికి వస్తే ఓ యువకుడికి, యువతికి, దెయ్యానికి మధ్య నడిచిన లవ్ స్టోరీయే ఈ సినిమా! ఈ చిత్రం ద్వారా టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ మొదటిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంజన, సంజనలుగా బిపాసా డ్యూయల్ రోల్లో నటించిన ఈ మూవీ వచ్చే జనవరి 16న రిలీజ్ కానుంది.