
‘వారిద్దరికి పెళ్లయింది.. కర్ణాటకలో పెళ్లైన ఇద్దరు మహిళ, పురుషులు వారి భాగస్వాములను వదిలేసి వచ్చి హైదరాబాద్ లో పనిచేస్తూ బతుకుతున్నారు. వచ్చినకాడ ఆ మహిళ కుదురుగా ఉండలేదు.. తను పనిచేస్తున్న చోట వేరొకరితో సంబంధం పెట్టుకుంది. ప్రేమించిన నన్ను గెంటేసింది.. అందుకే చంపేశా..’ నా నెలల బాబును దయచేసి మా తల్లిదగ్గరకు చేర్చండి.. ఇదీ లేచిపోయి కర్ణాటక నుంచి బతకడానికి వచ్చిన ఓ ప్రేమ జంట బలవన్మరణం తీరు..
అమ్మా నాన్న ఇద్దరు చనిపోవడంతో రెండు రోజులుగా ఆ ఐదునెలల చిన్నారి పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది.. రెండు రోజులుగా భార్యభర్తలిద్దరు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యజమాని వెళ్లి చూసేసరికి భార్యభర్తలిద్దరు రక్తమడుగులో ఉన్నారు. భర్త మంజునాథ్ భార్య మీనాక్షిని చంపేసి ఉరేసుకొన్నాడు.. ఆ చిన్నారి రెండు రోజులుగా పాల కోసం ఏడూస్తునే ఉన్నారు. పోలీసులు వచ్చి ఆ చిన్నారికి పాలు పట్టించి అక్కున చేర్చుకున్నారు.
ప్రేమించి భార్యభర్తల్ని కాదనుకొని వచ్చిన ఇద్దరు ప్రేమికులు తమలో తామే ఆర్థిక ఇబ్బందులతో కడతేర్చుకన్నారు. మహిళ పెట్టుకున్న మరో అక్రమ సంబంధం వారిద్దరు చావుకు కారణమైంది..