లీడర్ అంటే ఇలా……

హరీష్ రావు.. ఈ పేరు తెలియని ఉద్యమకారుడు లేడంటే ఆతిశయోక్తికాదేమో..! తెలంగాణ రాజకీయ యవనిక మీద ఎదిగివచ్చిన 21 వ శతాబ్ధపు నాయకుడాయన. 1980 దశకం నాయకుల ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో… మరో ఇరవై ముప్పై ఏళ్ల వరకు తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నారాయన. ఇపుడున్న నాయకగణంలో ఆయన్ను ఢికొట్టే దమ్మున్న నాయకుడు మరొకరు ఏ పార్టీలోనూ కనిపించడం లేదు. తెలంగాణ నాయకత్వంలో కొందరు యంగ్ జనరేషన్ లీడర్లు కనిపిస్తున్నా.. రాజకీయ ఎత్తుగడలు, మాస్ ఫాలోయింగ్ లో మాత్రం హరీష్ ఇతరులెవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయనొక సైన్యం. నాయకుడై నడిపిస్తాడు. కార్యకర్తలా ఆచరిస్తారు. గంజీ-బెంజ్ రెండూ తెలిసిన మాస్ లీడర్ ఆయన. ఉద్యమం నేర్పిన పాఠాలు, కేసీఆర్ దిశానిర్దేశంలో అన్నింటా ఆరితేరారు హరీష్. మాటలో స్పష్టత, ఆకట్టుకునే చిరునవ్వు, శత్రువును సైతం మంత్రముగ్దులను చేసే రాజకీయ వ్యూహాలు ఆయన అలంకారాలు. అనుకువ తప్ప అహంకారం కనిపించని నైజం ఆయనది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఆయన్ను ఆప్యాయంగా హరీశన్న అని పిలుస్తుంటారు. ఆయనొస్తే.. సొంతమనిషే ఇంటికొచ్చినట్టు భావిస్తారు తెలంగాణ ప్రజలు.

ప్రజా సమస్యలు, వారి కష్టాలను తీర్చాలనే డెడికేషన్ ఉన్న నాయకులు ఎప్పుడూ విశ్రాంతి గురించి ఆలోచించరు. తాము చేసే పనిలో నిమగ్నమైపోతారు. ఆకలి, నిద్ర, ఇతర దైయనందిన కార్యకలాపాలు కూడా వారి పనిలో భాగంగానే ఉంటాయి. ప్రజాసేవే వ్యాపకంగా సాగిపోతుంటారు. లక్ష్యం కోసం పని చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనో డైనమైట్. ఎప్పుడు ఎటునుంచి విరుచుకుపడతాడోనని నాటి అధికారపక్షం హడలిపోయేది. ఎప్పటికప్పుడు పోలీసులు ఎత్తులను చిత్తు చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు హరీష్. పోలీసు డేగకళ్లను, ఇంటలీజన్స్ నిఘా నేత్రాలకు చిక్కకుండా ఉద్యమంలో మమేకమయ్యేవారు. ఉద్యమ అనుభూతులు చెబుతూ పోతే … ఎన్నోమరెన్నో మలుపులు మనకు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. జేఏసీ నిర్వహించిన మిలియన్ మార్చ్లో పాల్గొనకుండా హరీశ్ రావు నియంత్రించేందుకు నలుదిక్కులు బందించారు నాటి పోలీసులు. గాలి నుంచి వచ్చే చాన్సులేదు కాబట్టి, ఇక హరీష్ రావు ట్యాంక్బండ్కు చేరుకోలేరని నాటి పాలకులు విర్రవీగారు. కానీ పోలీసుల ఎత్తులను చిత్తుచేస్తూ, పాలకపక్షం నివ్వెరపోయేలా హుస్సేన్ సాగర్లో బోటులో దూసుకొచ్చిన సాహసి ఆయన.  సాగరహారంలో జిల్లాల నుంచి జనం రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. అడుగడుగునా అడ్డంపడ్డారు. అపుడు సిద్దపేట నుంచి  ఇరవై వేల మంది సైన్యంతో హైదరాబాద్ పోలీసుల వ్యూహాలపై దండెత్తిన హరీష్… ఆ బ్యారికేడ్లను బద్దలుకొట్టారు. అంతెందుకు సడక్బంద్ పేరుతో జాతీయ రహాదారులను బందించాలని చూస్తే.. నాటి సర్కారు కఠినంగా అణచివేసే కుట్ర చేసింది. ఒక్కడు, ఒకే ఒక్కడు ఆ కుట్రలను ఛేదించాడు. పాలమాలకుల దగ్గర పోలీసులను తీర్మాన్ అడించాడు. హకుం జారీ చేసే స్థాయి నుంచి పోలీసులే వచ్చి బ్రతిమానుకునేలా చేసిన నేర్పరి ఆయన. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మజిలీలోనూ తనదైన ముద్రవేశారు. విద్యుత్ సౌధ దగ్గర గిరిగీసి బరిలో దిగి కొట్లాడారు హరీష్ రావు.  ఇలాంటి సంఘటనలు ఆయన గుండెదైర్యం, దీక్షాదక్షత, కార్యసిద్దికి సాక్షీభూతాలుగా నిలిచాయి..

రాజకీయ వ్యూహాల్లో తిరుగులేని నాయకుడు హరీష్ రావు. మేనమామ కేసీఆర్ కనుసన్నల్లో మెలిగిన వ్యక్తి. కేసీఆర్ ఆదేశిస్తారు, హరీష్ రావు ఆచరిస్తారని టీఆర్ఎస్లో చెప్పుకుంటుంటారు. కేసీఆర్ మనసెరిగి నడుచుకుంటారు హరీష్ రావు.  రాష్ట్ర సాధనతో తమ పాత్ర పూర్తికాలేదని భావించారు కాబట్టే బంగారు తెలంగాణ కోసం పరితపిస్తున్నారు. 14 ఏళ్ల ఉద్యమం సమయంలో ఏనాడు అధికారం కోసం ఆలోచించని పార్టీ టీఆర్ఎస్. 2014 సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందుకు కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మిన వాళ్ల సంఖ్య కూడా పెద్దగా లేకపోవచ్చు. అలాంటి సంధికాలంలో కేసీఆర్ తో తోడుగా, నీడగా వెన్నంటే ఉండి, ప్రజల దీవెనలతో  టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడంలోనూ హరీష్ రావు  కీలక పాత్రపోషించారు. హరీష్ రావు కృషిని, పట్టుదల ను ముఖ్యమంత్రి ఎప్పుడో గుర్తించారు. రాచకీయ చతురతను, కార్యదక్షతను కూడా కూడా పలుమార్లు మెచ్చుకున్నారు. ఓ సందర్భంలో అయితే ఏకంగా ఆరు అడుగుల బెల్లెట్ అంటూ హరీష్ కు కితాబిచ్చారు కేసీఆర్. యంగ్ డైనమిక్ లీడర్ అంటూ ఆకాశానికెత్తేశారు మరో సందర్భంలో.

అసలే కొత్త రాష్ట్రం. ఆ పైన కొత్త ప్రభుత్వం. పాలనలో అంతగా అనుభవం లేని నాయకగణం. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో తెలియన తరుణం. మరొక వైపు తెలంగాణ విఫలమైతే చూసి నవ్వుకోవాలని చూసే గుంటనక్కల సమూహం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బంగారు తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు కేసీఆర్. అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖను హరీష్ రావుకు అప్పగించారు. ఎంత చతురత ఉన్నా.. ఎంత ప్రజాదారణ ఉన్నా … అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కూడా అంత సులువుకాదు. ఎంతో నేర్పరితనం. క్షణాల్లో వ్యూహాలు పన్నే చతురత ఉంటే తప్పా… అసెంబ్లీ వ్యవహారాలను నడపడం సాధ్యంకాదు. కత్తిమీద సాములాంటి అసెంబ్లీ వ్యవహారాలను తనదైశిలో నడిపించారు హరీష్. సభను హుందా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నడుపుతూ… ప్రశంశలు పొందుతున్నారు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల నుంచే సభా నిర్వహణపై హరీష్ మార్కు కనిపిస్తుంది. ప్ర‌తిప‌క్షాల తీరును ఎండ‌గ‌ట్ట‌గ‌ల‌గ‌డటం. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గిలేలా చూడ‌టం రెండు ప‌ర‌స్ప‌ర విరుద్ద‌మైన అంశాలు. కానీ ఆ రెండిటీనీ చాలా అల‌వోక‌గా అదిగ‌మించారు హ‌రీష్. తెలంగాణ అసెంబ్లీ జ‌రుగుతున్న తీరు.. ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ పాల‌సీల మీద జ‌రుగుతున్న అర్థ‌వంత‌మైన చ‌ర్చ దేశంముందుకు తెలంగాణ‌ను గర్వంగా నిల‌బెడుతోంది. ముప్పై న‌ల‌భై ఏళ్ల క్రితం ఎలా స‌భ జ‌రిగిందో మ‌ళ్లీ అలాంటి స‌భ‌ను చూస్తున్నామ‌ని చాలా మంది సీనియ‌ర్ రాజ‌కీయ నాయకులు కూడా మొచ్చుకున్నారు. స‌భ నిర్వ‌హ‌ణ అంటే అంత ఆశామాషీ విష‌యంగా కాదు. కానీ అలాంటి సంక్లిష్ట‌మైన అంశాల్లోనూ నూటికి నూరు మార్కులు సాధించ‌డం ఒక్క హ‌రీష్ కే సాధ్య‌మైంది.

60 ఏండ్ల స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జ‌రిగిన అంశాల్లో నీటి పంపిణీ అత్యంతకీల‌క‌మైన‌ది. పేప‌ర్ల‌మీద కేటాయింపులున్నా.. తెలంగాణ బీళ్ల‌కు మాత్రం నీళ్లు పారేవి కాదు. అందుకే అన్యాయాన్నిస‌రిచేసే బాధ్య‌త‌ను, తెలంగాణ రైతు మొహంలో వెలుగులు నింపే కార్యాన్ని భూజాల‌కెత్తుకున్నారు హ‌రీష్ రావు. ప్ర‌భుత్వంలో మ‌రో కీల‌క‌మైన నీటిపారుద‌ల శాఖ‌ను చేప‌ట్టారు. ఆయ‌న ప‌నితీరును చూసిన వాళ్లు, ఆప్యాయంగా పని రాక్షసుడు అంటున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన కృషి ఆమోగం. ప్రాజెక్టుల దగ్గర చాప-దిండు వేసుకొని కటిక నేల పడుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. మంత్రి అంటే మందీమార్బలంతో వచ్చి అలా పైపైన ప్రాజెక్టును చూసిపోవడం గత సంప్రదాయం. ఏసీ గదుల్లో కూర్చొని సమీక్షించడం ప‌రిపాటి. కానీ హరీష్ రావు మాత్రం అనువణువు పరిశీలిస్తారు. ప్రతిక్షణం సమీక్షిస్తుంటారు. పునాదులు సరిగాపడకుంటే, భావితరాలు నష్టపోతాయని ఆయ‌న‌కు తెలుసు. అందుకే త‌న శాఖ తీరుప‌ట్ల పరితపిస్తుంటారు. రోజూ 24 గంటల్లో 18 గంటలకు పైగా ప్రజాసేవకే కేటాయిస్తుంటారు. జనంలో ఉండటం, జనంతో కలిసి తినడం ఆయన నిత్య కృత్యం. అందుకే ఆయన్ను చూస్తే జనం కూడా తమ సొంత మనిషిని చూసినట్టు ధైర్యపడతారు. ఆయన కదిలితే ఓ సైన్యం నడిచివచ్చినట్టు ఉంటుంది. అందుకే ఆయన మాస్ లీడర్ గా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. సిద్ధ‌పేట. మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల‌కైతే ఆయ‌న ఇంట్లో మ‌నిషే. ఆయన జ‌నాల‌కు ఎంతలా చేరువ‌య్యారు అంటే.. ఉద్య‌మ స‌మ‌యంలో సిద్ధ‌పేట‌లోని ఏ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చినా .. హ‌రీష్ రావే స్వ‌యంగా కాల్ లిప్ట్ చేసేవారు. ప్ర‌జ‌ల క‌ష్ట‌మేంటో, వారికి ఏ ప‌నికావాలో తెలుసుకొని, చేయించిపెట్టే వారు. కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అంటూ అప్ప‌టో ఓ ప్ర‌ధాన తెలుగు పత్రికా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ కూడా వేసింది. అది ఆయ‌న గొప్ప‌ద‌నం. హ‌రీష్ రావు దక్కరకు పనికో సమో, సాయం కోసమో వచ్చిన వాళ్లు.. ఆ ఫలాన్ని అందుకున్నారా లేదా అని కూడా క్రాస్ చెక్ చెయ్యడం ఆయనకే చెల్లింది. మంత్రిగా ఉంటూ బిజీబిబీగా గడుపుతున్నా.. ఫలానా పని ఎంత వరకు వచ్చిందని అడిగి తెలుసుకొవడం ఆయనొక్కడే సాధ్యమైంది. తనను అభిమానించే వారి కోసం, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడం కూడా ఆయనెప్పుడూ మరచిపోరు. ఎంత బిజీగా ఉన్నా, క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపినా, ఏదో ఒక సంద‌ర్భంలో ఫ‌లానా ప‌ని ఎంత వ‌ర‌కు వ‌చ్చింద‌ని ఆరా తీస్తుంటారు. ఆయ‌న జ్ఞాప‌కశ‌క్తిని చూసి పేషిలో ప‌ని చేసే అధికారులే ఎన్నో సంద‌ర్భాల్లో ఆశ్చ‌ర్య‌పోతుంటారు..

నీటిపారుద‌ల శాఖ ఓ సముద్రంలాంటింది. చూడాటానికి అందంగా క‌నిపిస్తుంది. కానీ, ఎంత చ‌దివినా అర్థంకాని అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రాజెక్టుల లెక్క‌లు, వాటి ల‌క్ష్యాలు, టెండ‌ర్లు, కేటాయింపులు, ఆయ‌క‌ట్టు, అనుమ‌తులు ఇలా చెప్పుకుంటూ పోతే స‌వాల‌క్ష అంశాలుంటాయి. మామూలు వాళ్లు అయితే రెండు మూడేళ్లు స్టడీ చేస్తే గానీ ఆ శాఖ మీద ప‌ట్టురాదు. కానీ హ‌రీష్ రావు మాత్రం కొద్ది నెల‌లోపే.. ఆ మాట కొస్తే కొద్ది రోజుల లోపే ప‌ట్టు సాధించ‌గ‌లిగారు. ఏ ప్రాజెక్టు ప‌నులు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయి. ఏ అనుమ‌తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్క‌డ టెండ‌ర్లు పిల‌వాల‌నే శాఖ అధికారులు చూసుకుంటారు. కానీ హ‌రీష్ రావు మాత్రం అలా బాధ్య‌త‌ల‌ను ఎవ‌రి మీదో వ‌దిలేసి ఊరుకోరు. ఎవ‌రికి అప్ప‌గించిన బాధ్య‌త‌ను వాళ్లు స‌రిగా నిర్వ‌హిస్తున్నారో లేదో ఎప్ప‌టికప్పుడు మానిట‌ర్ చేస్తుంటారు. తాను వాళ్ల‌కు ఆద‌ర్శంగా ఉంటూ, త‌న‌వాళ్లంద‌రూ మిగ‌త వాళ్లకు ఆద‌ర్శ‌గా ఉండేలా చూసుకుంటారు. అప్ప‌ట్లో ఆయ‌న్ను కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అన్న‌ట్టుగా.. ఇపుడు వాట్స్‌ప్ మంత్రి అంటే బాగుంటుందేమో. ప్ర‌తిశాఖ కు ఓ వాట్స్‌ప్ గ్రూపు ఉంటుంది. అందులో అధికారులంతా ఎప్ప‌టిక‌ప్పుడ స‌మాచారం చేర‌వేస్తుంటారు. దీంతో ఎవరు ఎక్క‌డున్నా స‌మాచారం చేరిపోతుంది. శాఖ‌లోని అధికారుల మ‌ధ్య కూడా స‌మాచారం ఈజీగా భ‌ట్వాడ అవుతోంది. దీంతో ఏ ప‌ని కూడా పెండింగ్‌లో ఉండే అవ‌కాశమే లేకుండా పోయింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో అయితే మంత్రిగారి చాంబ‌ర్‌కు ఫైల్ వెళితే అది ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌స్తుందో ఆ దెవుడికి కూడా తెలిసేకాదు. కానీ హ‌రీష్ రావు పేషిలో అలా ఉండ‌దు. ఎలాంటి ఫైల్ అయినా స‌రే 48 గంట‌ల్లో క్లియ‌ర్ కావాల్సిందే. ఏంతో ఇంపార్టెంట్ లేదా వివాదానికి సంబంధించిన ఫైలో అయితేనే.. మూడు, నాలుగు రోజులు ప‌డుతుంది కానీ మిగ‌తావ‌న్నీ త‌క్ష‌ణం క్లియ‌ర్ అవుతాయి.

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయ ఎంత స‌క్సెస్ అయిందో ప్ర‌పంచ‌మే చెబుతోంది. అందులో ముమ్మాటికి మంత్రి హ‌రీష్ రావు కృషే కార‌ణం. కాక‌తీయుల గొలుసుక‌ట్టు చెరువుల‌ను పున‌రుద్ద‌రించేంద‌కు ఆయ‌న ప‌రిత‌పించారు. అన్నీ తానే అయి చెరువుల‌ను బ్రతికించుకున్నారు. యుద్ద‌ప్రాతిప‌దిక తొలిద‌శ పూర్తి చేయించారు. రెండో ద‌శ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ యేడాది పుష్క‌లంగా వ‌ర్షాలు ప‌డితే.. మ‌రో రెండు మూడేళ్ల‌కు క‌రువు లేకుండా చేసే బ్ర‌హ్మండ‌మైన కార్య‌క్ర‌మం మిష‌న్ కాక‌తీయ‌. చాలా ఊళ్ల‌లో చెరువులు ఇప్ప‌టికే నిండిన‌ట్టు చూస్తున్నాం. అది ఖ‌చ్చింత మిష‌న్ కాక‌తీయ వ‌ల్లేన‌ని చెప్ప‌వ‌చ్చు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మేనమామ కేసీఆర్ మాటలను ఒంటబట్టించుకున్నారేమో గానీ.. ఎక్కడ అహం కనిపించని మనిషి హ‌రీష్.  ఎంత కష్టం వచ్చిన చిరునవ్వు చెరగని మనిషి ఆయన. అలసట కనిపించని లీడర్. మునిపంటికింద కష్టాన్ని తొక్కిపెట్టి, ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజం. తెలంగాణ తల్లి దాస్య సృంఖలాలు తెచ్చుకొని, స్వ‌రాష్ట్రంగా అవ‌తరించిన మరుసటి రోజే ఆయన కూడా పుట్టిన రోజు కూడా . ఇది యాదృశ్చిక‌మే కానీ ఆయ‌న తెలంగాణ త‌ల్లి ముద్దుల‌బిడ్డ అని చెప్ప‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఇప్ప‌టికే ఆయ‌న నాయ‌క‌త్వం ఏంటో తెలంగాణ స‌మాజానికి తెలిసొచ్చింది. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న స‌మ‌ర్థత‌, నిబ‌ద్ద‌త, కార్య‌సాధ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామర‌క్ష‌గా నిల‌వ‌చ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *