Breaking News

లీకేజీలతో సినిమా కష్టాలు..

Baahubali pOsters

హైదరాబాద్, ప్రతినిధి : టెక్నాలజీ జనం జీవితంలో ఎంత మార్పు తెచ్చిందో.. అంతే చెడును మోసుకొచ్చింది. ఒకప్పుడు వీసీడీలతో మొదలైన మన టీవీ ప్రయాణం నేడు చిన్న మైక్రోచిప్ (మెమోరీ కార్డు)లకు పాకింది. దీంతో సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే అది ఇంటర్ నెట్ లో .. స్మార్ట్ ఫోన్లలో దర్శనమిస్తోంది. ఇంతలా దిగజారిపోయిన పరిస్థితుల్లో కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత, సంవత్సరాలు తీసిన దర్శకుడి ప్రతిభ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది.

pawans-ad-02

గతంలో అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే సగం పార్ట్ నెట్ లో విడుదలై కలకలం రేగింది. దీంతో ఎప్పుడో విడుదల చేస్తానన్న మూవీని ఆదరబాదరగా విడుదల చేశారు. నిర్మాత, దర్శకుడు, నటుడు పవన్ ఈ సినిమాను కొందరు కావాలనే తమను దెబ్బకొట్టడానికే ఈ పనిచేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఆ సినిమా హిట్ అయ్యిందికాబట్టి సరిపోయింది కానీ.. ఒక ప్లాప్ అయితే పరిస్థితి దారుణంగా ఉండేది. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందు నెట్ లో .. స్మార్ట్ ఫోన్లలో దర్శనమిచ్చింది. హిట్ కొట్టడంతో డబ్బులు మాత్రం వచ్చాయి. లేకపోతే ఏమై పోయేదో..

ఇక బాహుబలి సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. రెండేళ్లుగా ఎంతో శ్రమకోర్చి వేల మంది టెక్నిషియన్లు, ఆర్టిస్టులతో రాజమౌళి తీస్తున్నారు. బాహుబలి సినిమా ను గ్రాఫిక్స్ విషయమై ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించగా అందులోని ఒక మాజీ ఉద్యోగి దాన్ని కాపీ కొట్టాడు. నెట్ లో పెట్టాడు. దీనిపై రాజమౌళి ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. నిందితున్ని అరెస్ట్ చేసినా బాహుబలి సినిమా 15 నిమిషాల నిడివి మాత్రం ఫేస్ బుక్, వాట్సాప్ లలో అందరికీ చేరింది. దీంతో విడుదలకు ముందే ఎంతో క్యూరియాసిటీ పెంచిన బాహుబలి టీంకు చాలా నష్టం వాటిల్లినట్లైంది.

ఏదీ ఏమైనా ఇలాంటి లీకేజీలు తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దెబ్బగా మారుతున్నాయి. కోట్లు పోసి, జీవితాన్ని ఆర్పిస్తున్నట్టు చేస్తున్న సినిమాలు కొందరి స్వార్థం వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇప్పటికైనా సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ లు రిలీజ్ కు ముందు దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *