
2008 ఆగస్టు 9 నుంచి సుమ యాంకర్ గా ఈటీవీలో కొనసాగుతున్న స్టార్ మహిళ ప్రోగ్రాం ఇప్పటికీ 2000 ఏపిసోడ్స్ దాటి దూసుకుపోతుంది. ఇంత కాలం భారతదేశంలో నడిచిన ప్రోగ్రాం ఇంకోటి లేదట.. దీంతో ఇన్ని ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు యాంకర్ సుమకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ’ వారు తన బుక్ లో స్థానం కల్పించారు. ఈ మేరకు సుమకు లిమ్కా బుక్ రికార్డ్స్ పురస్కారంతో పాటు సర్టిఫికెట్ అందింది.
కాగా తెలుగు టీవీల్లోనే కాకుండా దేశంలోనే ఈ స్టార్ మహిళ అత్యంత ఎక్కువ కాలం నడిచిన ప్రోగ్రాం. అందుకే ఆమె ఈ లిమ్కా బుక్ లో స్థానం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.