లింగాయత్ ల కోసం 5కోట్లతో భవనం

-బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ ప్రకటన

హైదరాబాద్ : హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా లింగాయత్ ల కోసం హైదరాబాద్ లోని 1 ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో భవనం నిర్మిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లింగాయత్ లను ఓబీసీ చేర్చడంపై ప్రధాన మంత్రికి లేఖ రాస్తానని.. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ బాధ్యతను భూజాలకెత్తుకొని దాన్ని సాధించాలని కోరారు.

అంతేకాకుండా హైదరాబాద్ లో బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అనంతరం మహాత్మ బసవేశ్వర లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును కేంద్రంలో ఐఏఎస్ గా పనిచేస్తున్న ఆదిలాబాద్ కు చెందిన అధికారికి అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *