లింగంపల్లి గ్రామస్తుల ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

లింగంపల్లి గ్రామస్తుల అంగీకారం, అభిప్రాయం మేరకే ప్రాజెక్టుపై నిర్ణయం

లింగంపల్లి గ్రామ ప్రజల బాధలు, సమస్యలు స్వయంగా వినాలనే వచ్చాను

మీ కడుపులో బాధ, ఆవేదన, ఆవేశం అర్ధం చేసుకోగలను

నాకు ఈ భూమ్మిద ఎకరం భూమి లేదు, ఎకరం చెలక లేదు.

పదిమందికి ఉపయోగపడాలని ఆలోచించే వాడి తప్ప, మోసం చేసేవాడిని కాను

లింగంపల్లి గ్రామం కన్నతల్లివంటిది…కన్నతల్లికి ద్రోహం చేయను

మీరు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు…మీ గ్రామ కమిటీతో ఎన్నిసార్లు మాట్లాడడానికైనా సిద్ధం

మీ అభిప్రాయాన్ని సిఎం కేసిఆర్ వద్దకు నేను, ఎమ్మెల్యే రాజయ్య తీసుకెళ్తాం

సిఎం కేసిఆర్ నిర్ణయం మేరకే ప్రాజెక్టుపై మీతో మళ్లీ చర్చిస్తాం

లింగంపల్లి గ్రామస్తుల ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

జనగామ : లింగంపల్లి గ్రామస్తుల అభిప్రాయం, అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. లింగంపల్లి, మల్కాపురం వద్ద 10.78 టిఎంసీల రిజర్వాయర్ నిర్మాణం కోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో లింగంపల్లి గ్రామస్తులు అభిప్రాయం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, జనగాం కలెక్టర్ వినయ్ కృష్టారెడ్డి, దేవాదుల చీఫ్ ఇంజనీర్ బంగారయ్య, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆ గ్రామస్తులతో నేడు లింగంపల్లిలో ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖిలో గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధులు చాలామంది వారి అభిప్రాయాలు వెల్లడించారు. ప్రధానంగా మమ్మల్ని ముంచి, మాకు బతుకుదెరువు లేకుండా చేసే ప్రాజెక్టు వద్దు అన్నారు. ఎవరికో తాగునీరు, సాగునీరు ఇవ్వడం కోసం మా గ్రామాన్ని ముంచుతాం అంటే ఒప్పుకోమన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని సంబరపడితే…ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో మమ్మల్ని ముంచుతాం అంటే అంగీకరించమని చెప్పారు. ప్రభుత్వం పదే, పదే ప్యాకేజీ ఏం కావాలో అంటుంది తప్ప, ప్రాజెక్టు కడితే ప్రభుత్వం తరపున ఏం చేస్తామో చెప్పకపోవడం, మమ్నల్నే ప్యాకేజీ గురించి చెప్పమనడం మమ్మల్ని మోసం చేయడంగా భావిస్తున్నామమన్నారు. అందుకే ప్రాజెక్టు మాకు వద్దు అన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు, ఆవేదన, ఆక్రోశం విన్న తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. అవి…. ‘‘లింగంపల్లి గ్రామస్తుల అంగీకారం, అభిప్రాయం మేరకే ప్రాజెక్టుపై నిర్ణయం ఉంటుంది. నమ్ముకున్న గ్రామాన్ని, నమ్ముకున్న భూములను వదిలిపెట్టి వెళ్లాలంటే బాధతో కూడుకుందే. మీ బాధను నేను అర్ధం చేసుకోగలను. లింగంపల్లి గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశంలో వారి బాధలు, సమస్యలు వినాలనే వచ్చాను. మీ కడుపులో బాధ, ఆవేదన, ఆవేశం అర్ధం చేసుకోగలను. నమ్ముకున్న భూమిని, ఉన్న ఇంటిని, ఊరును వదిలిపెట్టి పోవాలంటే ఆ బాధ మామూలుగా ఉండదు. అయితే నాకు ఈ భూమ్మిద ఎకరం భూమి లేదు, ఎకరం చెలక లేదు. ఒక చెక్ తీసుకోలేదు. ఏదైనా పనిచేస్తే పదిమందికి ఉపయోగపడాలని ఆలోచించే వాడినే తప్ప, మోసం చేసేవాడిని కాను. నేను రాజకీయాలకు వచ్చినప్పటినుంచి అనేక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గెలిచినా..ఓడినా మెజారిటీ ఓట్లు ఇచ్చింది ఈ లింగంపల్లి గ్రామం, అందుకే ఈ గ్రామాన్ని కన్నతల్లి అన్నాను. కన్నతల్లికి ద్రోహం చేసే వ్యక్తిని కాను. మీకు ద్రోహం చేయాలనుకుంటే ఇక్కడకు వచ్చే వాడిని కాను. మీతో మాట్లాడేవాడిని కాను. ఇక్కడకు రాకుండానే చేసే పనిని చేసేవాడిని. నమ్మకున్న వారిని మోసం చేయడం మంచి నైజం కాదు. మీరందరూ ఏకగ్రీవంగా రిజర్వాయర్ వద్దు అన్నారు. మమ్మల్ని ముంచి వేరే వారికి న్యాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాగునీరు, సాగునీరు అందించాల్సిన అవసరం లేదన్నారు. వాస్తవంగా అన్ని జిల్లాల్లో పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. మన వరంగల్ జిల్లాలో పెద్ద రిజర్వాయర్ లేదు. చిన్న, చిన్న రిజర్వాయర్లు ఉన్నాయి. మా వరంగల్ జిల్లాలో కూడా పెద్ద రిజర్వాయర్ కట్టాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ నీటిపారుదల శాఖ అధికారులను సర్వే చేయమన్నారు. వారు గీసుకొండ, మైలారం, స్టేషన్ ఘన్ పూర్, గండి రామారం రిజర్వాయర్లు సర్వే చేసి, వాటిని పెంచడానికి చూశారు. కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం మల్కాపురం, లింగంపల్లి మధ్య ఉందన్నారు. దాని ప్రకారం నివేదిక ఇచ్చారు. అయినా ప్రాజెక్టు కట్టాలన్న, పనులు చేయాలన్న మీ అంగీకారం లేకుండా ముందుకు పోయే అవకాశం లేదు. ప్రభుత్వం పరంగా ఏ ప్యాకేజీ ఇస్తారో చెప్పండన్నారు. మీ అభిప్రాయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తాను. నేను, ఎమ్మెల్యే రాజయ్య మీ మాటలను సిఎం గార్కి చెబుతాం. తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది, గ్రామస్తులను ఒప్పించాలని సిఎం కేసిఆర్ గారు అంటే మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలన్నప్పుడు మీ గ్రామకమిటీతో ఒకటికి పదిసార్లు కూర్చోని మాట్లాడుతాం, ఫర్వాలేదు మేం ఒప్పుకుంటామని అంటేనే పని చేస్తాం తప్ప లేకపోతే చేయం.’’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. లింగంపల్లి గ్రామస్తులకు ద్రోహం చేసి రాజకీయం చేయాల్సిన అసవరం లేదని ఉఫ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తాను తప్పు చేసి ఉంటే మీ ఎదురుపడేవాన్ని కాదని, మీ మంచి కోసమే ఆలోచించే వాళ్లమని హామీ ఇచ్చారు. లక్ష మందికి ఉపయోగపడుతున్నప్పుడు గ్రామస్తుల కోసం ఆలోచించడం తప్ప తనకు వేరే ఉద్దేశ్యం లేదన్నారు. లింగంపల్లిని ముంచాలని లేదన్నారు. ఈ ప్రాజెక్టుపై తేలే వరకు మళ్లీ మీ ఊరికి ఎన్నిసార్లు రమ్మంటే అన్ని సార్లు వస్తాను, అన్నిసార్లు మాట్లడడానికి సిద్దంగా ఉన్నాను అన్నారు. కొంతమంది రాజకీయాలు చేస్తుంటారు…వారిని జాగ్రత్తగా గమనించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం, అప్పుడు చాలా గ్రామాలు, ఇళ్లు, భూములు పోయాయి, అలా పోతేనే ప్రాజెక్టులు వచ్చాయన్నారు. లింగంపల్లి ప్రాజెక్టు రేపు, ఎల్లుండో కట్టడం లేదని, మీ లింగంపల్లి గ్రామస్తులతో కూర్చోని మాట్లాడిన తర్వాతే ముందుకు వెళ్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.