లారీ తొక్కేసినా క్షేమంగా బయటపడిన సైక్లిస్ట్

బీజింగ్, ప్రతినిధి : చైనాలో అద్భుతం జరిగింది. భారీ ట్రక్కు పైనుంచి  వెళ్లినా ఓ సైక్లిస్టు తృటిలో అతి ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు వెంట  వెళ్తున్న ఈ యువకుడ్ని పద్నాలుగు చక్రాల భారీ ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొంది. సైక్లిస్టు కింద పడిపోయినా ట్రక్కు డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు.

లారీ చక్రాల మధ్య పడిపోయిన ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బతికి బయట పడ్డాడు. లారీ వెళ్ళిపోయాక తాపీగా లేచాడు. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే అతడికి చేయూతనిచ్చేందుకు రోడ్డుమీద వెళ్తున్న వారెవరూ ముందుకు రాలేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.