లవర్స్ రివ్యూ Movie Review

లవర్స్ రివ్యూ

Movie Name : లవర్స్

Censor : U/ A

Genre :లవ్ , కామెడీ ఎంటర్టైనర్

Rating : 2.75  /5

Casting: సుమంత్ అశ్విన్ , నందిత , సప్తగిరి , ఎం ఎస్ నారాయణ ……..

Art director : గోవింద్

Cinematography : జోషి

Music    :  జె . బి (జీవన్ బాబు )

Editor :  ఎస్ . బి . ఉద్ధవ్

Story , Screen  play, Dialogues : మారుతి

Presenter : మారుతీ

Producers : సూర్యదేవర నాగ వంశి , మహేంద్ర బాబు

Director  : హరినాథ్

Production house : మాయాబజార్ మూవీస్

Released Date :  15- 08-2014

Introduction  :  ‘ఈ రోజుల్లో ‘ అనే చిన్న సినిమా… అదీ నేటితరం యువత లైఫ్ అంటూ చూపించిన బూతు కంటెంట్ క్లిక్ అవడంతో మారుతి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. చిన్న సినిమా నిర్మాతలు అందరూ మారుతీ సక్సెస్ ని క్యాష్ చేసుకుందామని అతని వెంట పడ్డారు. మారుతీ కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తూ కానుకలూ గట్రా బాగానే అందుకుంటున్నాడు. మారుతి సర్వం తానై నడిపించిన సినిమాలు … రీసెంట్ గా వచ్చిన కొత్త జంట మినహా అన్ని సినిమాలు బాగానే డబ్బులు సంపాదించాయి.

కానీ మారుతి సమర్పించిన సినిమాలు…మారుతీకి కానుకలు సమర్పించుకున్న నిర్మాతలు ఒక్కరు కూడా సక్సెస్ కాలేకపోయారు. ఆయా సినిమాలు కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. మరోసారి అదే కోవలో వస్తున్న సినిమా లవర్స్. లవర్  బాయ్ గా ఇప్పుడిప్పుడే ప్రూవ్ చేసుకుంటున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుమంత్ అశ్విన్ కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందా? ప్రేమ కథా చిత్రం తో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన … అందం తో పాటు నటించడం కూడా తెలిసిన నందిత మరోసారి ఈ లవర్స్ ని కూడా సక్సెస్ బాట పట్టిస్తుందా?

Plot:సప్తగిరి లాంటి ఓ పిచ్చివాడిని బాగా చూసుకోమని …. మంచిగా మనిషిగా మార్చమని తను ప్రేమించే చిత్రా బాలసుబ్రమణ్యం అనే అమ్మాయి అడగడం తో హీరో అందుకు ఒప్పుకుంటాడు. అసలు ఈ సప్తగిరి పిచ్చికి కారణం ఎవరు? హీరో ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలతో… లవ్ బ్రేక్ అప్ అవడానికి కారణమైన చిత్రా ని తన సోల్ మేట్ అనుకున్న హీరో … ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నాడు? అబ్బాయిలు అందరు మోసగాళ్ళే , ఫ్లర్ట్స్ అనుకునే చిత్ర హీరో ప్రేమలో ఎలా పడింది? అనేది కథ. అమ్మాయిలను ద్వేషించే ప్రేమ పిచ్చివాడిగా సప్తగిరి కామెడీ కథ దీనికి అదనం.

Performance: సుమంత్ అశ్విన్ , నందిత చాలా చాలా బాగా పెర్ఫాం చేశారు. ఉదయ్ కిరణ్ , తరుణ్ ల తర్వాత లవర్ బాయ్ గా సెటిల్ అవడానికి కావలసిన అన్ని యాక్టింగ్ స్కిల్స్ , లుక్స్ సుమంత్ అశ్విన్ కి ఉన్నాయి. హి ఇజ్ సింప్లీ సూపర్బ్. నందిత కూడా యాక్టింగ్ బాగా చేసింది. కాకపోతే కొంచెం లావుగా కనిపించటం ఆ అమ్మాయికి మైనస్. ఇక సినిమా సక్సెస్ లో సింహభాగం సప్తగిరికి ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మానందం అని అనిపించుకుంటున్న సప్తగిరి ఈ సినిమా సెకండ్ హాఫ్ ని సింగిల్ హ్యాండ్ తో క్యారీ చేశాడు. అతని క్యారెక్టర్… యాక్టింగ్ అండ్ అతని నోటి వెంట వచ్చిన డైలాగ్స్ ఫుల్ ఫన్ క్రియేట్ చేశాయి.

Technical  : మారుతి ఈ సినిమా కు రాసిన కథ కంటే డైలాగ్స్ అండ్ కామెడీ సీన్స్ కి ఎక్కువ మార్కులు పడతాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. హరినాథ్ దర్శకత్వం ఓ కె. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ టూ గుడ్. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది.

Highlights  :
సుమంత్ అశ్విన్ , నందిత
సప్తగిరి కామెడీ
డైలాగ్స్
ఫోటోగ్రఫీ
మ్యూజిక్

Drawbacks  :కథంటూ లేకుండా సీన్స్ ని నమ్ముకుని స్క్రీన్ ప్లే అల్లుకోవడం

Analysis:  తను సమర్పించిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీసు దగ్గర డమాల్ అనడం… కొత్తజంటకు కూడా ఎక్కువ మైనస్ మార్కులే పడడంతో మారుతీ బ్రాండ్ కొంత డల్ అయింది. ఈ సినిమా తో మారుతి మళ్ళీ తన పెన్ పవర్ చూపించాడు. కామెడీ రాయటం లో తన బలాన్ని సప్తగిరి క్యారెక్టర్ తో సూపర్బ్ గా ప్రూవ్ చేశాడు. ప్రేమ కథ చిత్రం నుంచి బూతుని నమ్ముకోకుండా నీట్ గా సినిమాలు తీస్తున్న మారుతీ ఈ సినిమా లో కూడా ఎక్కడా హద్దులు దాటలేదు. సుమంత్ , అశ్విన్ నందిత పెయిర్ కూడా ఈ సినిమా కు చాలా ప్లస్ అయింది. ఈ సినిమా తో సప్తగిరి స్టార్ కమెడియన్ గా ఇంకో మెట్టు ఎక్కినట్టే. కథ కూడా ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకుని ఉంటె మరో ప్రేమ కథా చిత్రం అయి ఉండేది. కథ లేకే మధ్యలో కొంత సినిమా బోర్ కొడుతుంది. కానీ సప్తగిరి క్యారెక్టర్ తో ఆ గ్యాప్ ని ఫిల్ అప్ చేశారు. పక్కా పైసా వసూల్ సినిమా.

Bottom Line : రొటీన్ తెలుగు కామెడీ లవర్స్… టైం పాస్ ఫిలిం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *