Breaking News

లక్ష మంది వచ్చినా అన్నం ఫుల్

20151227a_012134004

-900మంది వంటగాళ్లు..,400మంది సహాయకులతో చండీయాగంలో భోజన ఏర్పాట్లు
మెదక్ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో లక్ష మంది భక్తులు వచ్చినా కాదనకుండా బోజనాలు వడ్డించేలా ఏర్పాట్లు చేయించారు సీఎం కేసీఆర్.. దాదాపు 50వేల మందికే రోజూ వంటలు సిద్దం చేయించారు తొలిరెండు రోజులు.. కానీ మూడు, నాలుగు రోజుల్లో లక్ష 50వేల మంది తరలివచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ అప్పటికప్పుడు బోజన శాల పక్కనే మరో భారీ షెడ్ ను రాత్రికి రాత్రే నిర్మింపచేసి లక్షమంది తినగలిగేలా ఏర్పాట్లు చేయించారు.

కాగా వంటల కోసం 900 మంది వంటగాళ్లు నిరంతరం శ్రమిస్తున్నారు. అన్నపదార్థాలను భక్తులకు వడ్డించేందుకు మరో 400మంది సహాయకులు వంటలు వడ్డిస్తున్నారు. అన్నం అయిపోగానే అప్పటికప్పుడు వండుతున్నారు. రోజూ సగటున 15 టన్నుల బియ్యం, 4 టన్నుల కూరగాయలు, 3 టన్నుల సాంబారు, 2 టన్నుల పెరుగు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా అయుత చండీయాగంలో వడ్డిస్తున్న బోజనం తిరుమల తిరుపతిలో వడ్డిస్తున్న అన్నప్రసాదం అంతా స్వీటుగా ఉంటోందని చండీయాగానికి వచ్చిన జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *