
గోవిందరావుపేట(వరంగల్) : మండలంలోని లక్నవరం సరస్సుపై నిర్మించిన వేలాడే వంతెనపై ఎంఎస్ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న ప్రేమంటే సులువుకాదురా చిత్రం పాటలను చిత్రీకరించారు. హీరోహీరోయిన్లు ఆదర్శ్బాబు, శ్రీవాణి, డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్ తదితరులు షూటింగ్లో పాల్గొన్నారు. పాఖాల, రామప్ప తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నట్లు దర్శకుడు ప్రసాద్ తెలిపారు.