
వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ 302/6 భారీ స్కోరు సాధించింది. 50ఓవర్లలో రోహిత్ సెంచరీ(108 బంతుల్లో 137) పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. రోహిత్ తో పాటు సురేశ్ రైనా (65) పరుగులు వేగంగా చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ధవన్ 30, జడేజా 23, రహానే 19 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ ఆటగాళ్లలో అమ్మద్ కు 3 వికెట్లు, మోర్తాజా, షకీబుల్, రూబెల్ లకు ఒక్కో వికెట్ దక్కింది. కాగా బంగ్లా బౌలర్ల ధాటికి మొదట్లో భారత బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. రైనా రావడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. పవర్ ప్లేలో రైనా ధారళంగా పరుగులు చేశారు. మరోవైపు రోహిత్ కూడా సమయోచితంగా ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 45 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 109 పరుగుల తేడాతో విజయం సాధించి ఇండియా సెమీస్ కు దూసుకెళ్లింది.