Breaking News

రోమాన్స్ వీడియో అవుట్.. మంత్రి పదవి గాన్..

bhikku-kiss-seithy-20130906-172

చైన్నై : తమిళనాట ఓ మంత్రి పదవి ఊడింది. సరసాలాడుతున్న వీడియో ఒకటి బయటకు రావడం ఆయన మంత్రి పదవి ఊడడానికి కారణమైంది. తమిలనాడు పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి బీవీ రమణ ఒక మహిళతో ముద్దు ముచ్చట్లలో తేలియాడే వీడియో ఒకటి తమిళనాట ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ విషయం తెలిసిన తమిళనాడు సీఎం జయలలిత ఆయన ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొని గవర్నర్ రోశయ్యకు సిపారసు చేశారు.. ఆయన జయలలిత సిఫారసుకు ఆమోదం తెలిసి రమణను మంత్రి పదవినుంచి తొలగించారు. ఆయనకున్న మరో పదవి అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి పదవి నుంచి సైతం తప్పించారు.

కాగా  ఈ సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి.. దీంతో జయలలితకు ప్రతిష్టగా మారింది. మంత్రి సరసాలు నెట్ లో ప్రభుత్వం పరువును తీస్తుండడంతో ఆమె వెంటనే స్పందించి ఆయన పదవిని తీసేశారు.. కాగా వీడియోలో ముద్ద సీన్లలో ఉన్న మహిళ ఆయన భార్యనే అని సమాచారం. తెలియకుండా వచ్చిన ఈ వీడియో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో జయలలిత ఈ నిర్నయం తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *