రోడ్ల మ‌రమ్మ‌తు బృందాల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌

న‌గ‌రంలో వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న రోడ్ల పున‌రుద్ద‌ర‌ణ‌లో పాల్గొనే కార్మికుల‌కు ప్ర‌త్యేక శిక్షణ ఇస్తుంది జీహెచ్ఎంసీ. ఇటీవ‌ల వ‌రుస‌గా కురుస్తున్న వ‌ర్షాల‌కు రోడ్ల‌పై పెద్ద సంఖ్య‌లో గుంత‌లు ఏర్ప‌డ‌డం, వీటిని పూడ్చడంలో త‌గు ప్రమాణాల‌ను పాటించేందుకు లేబ‌ర్‌కు త‌గు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయాల‌ని డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. దీనికితోడు న‌గ‌రంలో చేప‌డుతున్న రోడ్ల‌పై ఏర్ప‌డ్డ గుంత‌ల‌ను పూడ్చ‌డంలో త‌గు ప్ర‌మాణాల‌ను పాటించ‌డంలేద‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కూడా గ‌మ‌నించారు. అయితే ప్ర‌స్తుత వ‌ర్షాకాల సీజ‌న్‌లో ఏవిధ‌మైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 384 ప్ర‌త్య‌కే బృందాల‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఈ 384 బృందాల‌లో ఉండే కార్మికులు (వ‌ర్క‌ర్లు) తాత్కాలిక ప‌ద్ద‌తిన నియామ‌కం కావ‌డంతో వీరిని రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, గుంత‌ల పూడ్చివేత‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీంతో న‌గ‌రంలో ఉన్న అన్ని వ‌ర్షాకాల ఎమ‌ర్జెన్సీ బృందాల్లో ఉన్న వ‌ర్క‌ర్లంద‌రికీ ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను ఇంజ‌నీర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బిటి మిక్సింగ్‌, ఉష్ణోగ్ర‌త‌లు ఏస్థాయిలో ఉండాలి. గుంత‌లు ఏర్ప‌డ్డ రోడ్డుపై ఎంత మేర త‌వ్వ‌కం జ‌ర‌గాలి. నీరు లేకుండా చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాలపై మాన్సూన్ బృందాల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్ అధికారులు క‌ల్పించారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల జులై 1వ తేదీ నుండి నేటి వ‌ర‌కు రోడ్ల‌పై 4 వేలకు పైగా గుంత‌లు ఏర్ప‌డ‌గా వీటిలో 90 శాతం పూడ్చివేశామ‌ని, మిగిలిన‌వి కూడా యుద్ద‌ప్రాతిప‌దిక పై పూర్తిచేయాల‌ని ఇంజ‌నీర్ల‌ను ఆదేశించామ‌ని క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. ఇప్ప‌టికే రోడ్ల‌పై ఏర్ప‌డ్డ గుంత‌లు, దెబ్బ‌తిన్న రోడ్ల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌పై పూడ్చివేయాల‌ని, జోన్ల వారిగా ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మీక్ష స‌మావేశాల‌ను ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్ తాను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలియ‌జేశారు.

road reparing 1     road reparing 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *