రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యాన్ని, నాణ్యతలోపాన్ని సహించేదిలేదు:జూపల్లి

 

 

* నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

* అసాధారణ జాప్యం జరిగితే వర్క్ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి

* ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీమేట్లను భారీగా పెంచడం కుదరదు, ప్రతిపాదనలనే జాగ్రత్తగా చేయాలి

* అనుమతించిన వారంలోపే పనులను ప్రారంభించాలి

15 రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేయాల్సిందే.

* ప్రస్తుతం జరుగుతున్న రోడ్లు, వంతెనల పనులన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలి

 * పనులకు ఇచ్చే కాల పరిమితిని తగ్గించే విషయాన్ని పరిశీలించాలి

* పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన మార్పులకు సంబందించి వారం రోజుల్లో ప్రతి పాదనలు అందజేయాలి

గతంలో రెండు, మూడేళ్లపాటు కూడా రోడ్డు నాణ్యత పరీక్షలు జరగని పరిస్థితి ఉండేది., ఇప్పుడు అలా జరగకూడదు.

* సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలి

* సాయిల్ టెస్ట్, డిజైనింగ్ లో జాప్యం లేకుండా చూసుకోవాలి.

* పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో ఉంచాలి

ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంజనీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీలతో నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

 

హైదరాబాద్: రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యాన్ని, నాణ్యతా లోపాన్ని సహించేదిలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీలతో నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులపై రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సమీక్ష నిర్వహించారు. అడ్డగోలుగా ఎస్టీమేట్లను పెంచడం, అసాధారణ జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. వర్క్ ఏజెన్సీలేవైనా పనుల్లో జాప్యం చేస్తే ఎప్పటికప్పుడు మెమోలు జారీ చేయడంతో పాటు, ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులకు సూచించారు. అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పనులకు అనుమతి వచ్చిన వారంలోపే ప్రారంభించాలని, 15 రోజుల్లోగా శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా లేఖలు రాస్తామన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణా సడక్ యోజన రహదారులు, వంతెనల పనులన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాల్లో పీఎంజీఎస్ వై కింద జరుగుతున్న 71 వంతెనలు, 37 రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే నాబార్డ్ కింద నాలుగు సర్కిల్లలో 334.72 కోట్లతో జరుగుతున్న 181 పనుల్లో 40 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన వాటిని జూన్ నెలాఖారులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఇచ్చే కాల పరిమితిని తగ్గించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన మార్పులకు సంబందించి వారం రోజుల్లో ప్రతి పాదనలు అందజేయాలని ఈఎన్సీ సత్యనారాయణ రెడ్డిని ఆదేశించారు. గతంలో రెండు, మూడేళ్లపాటు కూడా రోడ్డు నాణ్యత పరీక్షలు జరగని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా జరగకూడదని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రధానంగా సాయిల్ టెస్ట్, డిజైనింగ్ ల్లో జాప్యం లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో రంగారెడ్డి

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *