రోజాది నోరా…. మున్సిపాలిటీ నాలానా

రోజాది నోరా.... మున్సిపాలిటీ నాలానా

కుటుంబ సమేతంగా పవిత్ర పుష్కరస్నానం చేసి వచ్చిన రోజా ఈరోజు మునిసిపాలిటి నాలా లాగ తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే రాజకీయంగా తమకు పుట్టగతులు ఉండవని వైకాపా నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. ప్రజా రాజధాని నిర్మాణం కోసం దేశంలో ఎక్కడలేని విధంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. ఇది భారతదేశంలో ఒక రికార్డని దీనిని జీర్ణించుకోలేని వైకాపా నేతలు అనేక రకాలుగా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా వారి రాజకీయాలను రైతులు తిరస్కరించారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర్రాన్ని కేంద్రానికి సలహ ఇచ్చిన వైకాపా నేతలు రాష్ట్ర్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీతో అంటకాగుతూ ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తూనే ఉన్నారని ఆమె అన్నారు.
భవిష్యత్ తరాలకు దృష్టిలో ఉంచుకుని సహజ, మానవ వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి, సంక్షేమ యజ్ఞానికి విఘ్నాలు కల్గించేందుకు ఈ రాక్షస మూక రకరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉమ్మడి రాజధాని లో ప్రజల భద్రతను, సంక్షేమాన్ని ప్రశ్నార్ధకం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసినా కనీసం నిలదీయలేని దౌర్భాగ్యస్ధితిలో ఉన్న వైకాపా నేతలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అసెంబ్లీ లోపల, బయట దళితులను దూషించే రోజా దళితుల కోసం మాస్టర్ ప్లాన్ లో ఏం చేశారని ప్రశ్నించడం హస్యాస్పదంగానూ విడ్డూరంగానూ ఉంటుందన్నారు. రాజమండ్రిలో జరిగిన సంఘటన పట్ల అందరూ ఆవేదనను వెలిబుచ్చారు, కానీ శవాలమీద చిల్లర ఏరుకున్నట్లు.. రోజా ఈ విషయంపై రాజకీయాలు చేస్తుందన్నారు. వారి శవ రాజకీయాలను చీకొడుతూ ప్రజలు ఉత్పాహంగా
పుష్కరాల్లో పాల్గొంటున్నారు. తెలుగునేల నలుమూలల నుంచి ప్రజలు పుష్కరాల్లో పాల్గొంటుంటే వైకాపా తరుపున ఏరకమైన సేవా కార్యక్రమాలు చేపట్టకుండా ఏర్పాట్లపై రాజకీయం చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లాగ వైకాపా నేతలు ఎదురుచూస్తున్నారు. క్విడ్ ప్రోకోలు, మనిలాండరింగులు, సూట్ కేస్ కంపెనీల గురించి మాత్రమే ఆలోచించే వైకాపా నాయకులకు రాజధాని మాస్టర్ ప్లాన్ ఒక కలలాగ అనిపించడంలో ఆశ్చర్యం లేదన్నారు. పట్టిసీమ పై నానాయాగి చేసిన వైకాపా నేతలకు ఆగష్టు 15కల్లా ప్రాజెక్టు నుంచి నీరు వచ్చే అవకాశం ఉండటంతో నిద్రపడుతున్నట్లు లేదన్నారు. ఒక దార్శినిక ప్రణాళిక తో ముందుకెళ్తున్న చంద్రబాబు ప్రజా రాజధాని నిర్మించడానికి నిర్విరామంగా కృషి చేస్తుంటే బాధ్యతగల ప్రతిపక్షంగా సహకరించాల్సింది పోయి నీచ రాజకీయాలకు పాల్పడడం వైకాపా వారికే చెల్లిందని ఆమె వ్యాఖ్యానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *