Breaking News

రైల్వేలో సంస్కరణలు అమలు

suresh-prabhu02

న్యూఢిల్లీ, ప్రతినిధి : దేశంలోని రైల్వేలో సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టినట్టు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి రైల్వే బడ్జెట్ ను ఆయన బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. భారతీయ రైల్వేలు జీవనాడులని కేంద్ర రైల్వే మంత్రి అన్నారు. కాగా కొత్త రైళ్లు మార్గాలు, జోన్ల ప్రస్తావన లేకుండా వినూత్నంగా సాగింది రైల్వే బడ్జెట్. ఇప్పుడే ప్రకటిస్తే తమ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు గోల చేసి పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటాయని భావించిన బీజేపీ ప్రభుత్వం కొత్త రైళ్ల ప్రకటనను సమావేశాల చివరి రోజు ప్రకటిస్తామని చెప్పింది.

రైల్వే మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
-ప్రజల్లో ఉన్న ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి
-రైల్వేలో ప్రపంచస్థాయి ప్రమాణాలు నెలకొల్పడం..
-రైల్వేలో భారీగా ఉద్యోగాలు కల్పించడం
-భారతీయ రైల్వేల్లోకి భారీగా పెట్టుబడులు
-రైళ్లు, లైన్ల ఆధునీకరణతోపాటు వేగం పెంచటం..
-రాజధాని, శతాబ్ది, రైలు వేగం 170కి.మిలకు పెంచడం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *