
– స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు
హైదరాబాద్,ప్రతినిధి : రైల్వేలను ప్రవేటీకరించమని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేలను నడిపిస్తామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైల్వేలు ప్రైవేట్ పెట్టుడులు, విదేశీ ఎఫ్ డీ ఐ లపై సోమవారం హైదరాబాద్ లో ఉన్నతాధికారులు, రైల్వే అధికారులు, నిపుణులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సురేష్ ప్రభు మాట్లాడారు. ప్రపంచంలోనే భారతీయ రైల్వేలను అగ్రపథంలో నిలబెట్టేందుకు మోడీ రైల్వేలో విదేశీ పెట్టుబడులకు అనుమతించారని.. దీని వల్ల ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయని.. గ్రామీణ ప్రాంతాలకు కూడా రైల్వేలు విస్తరించి అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ దేశీయ రైల్వేల్లో ఎఫ్ డీ ఐల వల్ల సమూల మార్పులు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యం లేని ప్రాంతాలు చాలా ఉన్నాయని… రైల్వేల్లో పెట్టుబడులతో దశమారుతుందని చెప్పారు.