
12 మార్చి, 2018 న హైదరాబాదులోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గా ఎం.పి. గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షత వహించి కార్యక్రమానికి హాజరయిన పద్మా దేవేందర్ రెడ్డి, డిప్యూటి స్పీకర్ నాయిని నర్సింహా రెడ్డి, హోం శాఖా మాత్యులు, ఈటల రాజేందర్, ఆర్థిక శాఖా మాత్యులు, టి. హరీశ్ రావు, నీటి పారుదల, మార్కెటింగ్ శాఖా మాత్యులు, జి. జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖా మాత్యులు, తుమ్మల నాగేశ్వర రావు, రోడ్లు భవనాల శాఖా మాత్యులు, కె.టి. రామారావు, ఐ.టి, పురపాలక శాఖా మాత్యులు, అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖా మాత్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జిల్లా కార్పోరేషన్ అధ్యక్షులు, మండల, గ్రామ సమన్వయ సమితి సభ్యులు, రైతులు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్., వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్., వ్యవసాయ శాఖ సిబ్బంది, వ్యవసాయ అనుబంధ శాఖల కమిషనర్లు, సిబ్బందికి అహ్వానం పలికారు. మొదటగా ఈటల రాజేందర్, ఆర్థిక శాఖా మాత్యులు మాట్లాడుతూ.. 70 లక్షల రైతు కుటుంబాలకు అంటే 60 శాతంగా ఉన్న గ్రామీణ జనాభాకు నాయకత్వం వహించడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి, నియమించబడ్డారని ఆయన మా అందరికీ స్ఫూర్తినిచ్చే నాయకత్వాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేసారు. నాయిని నర్సింహా రెడ్డి, హోం శాఖా మాత్యులు మాట్లాడుతూ… మన ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అందులో భాగంగానే పంటకు పెట్టుబడి పథకాన్ని ముందుకు తెచ్చారని అన్నారు. దేశానికే మనం ఆదర్శం అవుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరయిన మంత్రులకు, ప్రజా ప్రతినిధులందరికీ, వ్యవసాయ సిబ్బందికి అనుబంధ రంగాల కమిషనర్లు, సిబ్బందికి. వచ్చిన రైతాంగానికి, రైతు నాయకులకు, మీడియాకు నమస్కారాలు తెలియజేసారు. ఈ రోజు వ్యవసాయం సంక్షోభంలో ఉందని, దేశానికే మనం దిక్సూచి అయ్యే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయానికి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తున్నారని అన్నారు. మన ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చడంలో భాగంగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల సిబ్బంది సహకారంతో మనం ముందుకు పోవాలని అన్నారు. అధికారులకు మనం సహకరించడానికే తప్ప వారితో కలహించడానికి కాదని అన్నారు. కె.టి. రామారావు, ఐ.టి, పురపాలక శాఖా మాత్యులు మాట్లాడుతూ… వ్యవసాయంలో విప్లవాత్మక సంస్కరణలకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎం.ఎస్. స్వామినాథన్ తో సహా పలు శాస్త్రవేత్తలు చేసిన సిఫార్సులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడు బిగించిందని అన్నారు. కనీస మద్దతు ధర సాధించడం కోసమే రైతు సమన్వయ సమితులన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఎకరా సాగుకు నీళ్ళు ఇవ్వడం ద్వారా హరిత విప్లవం, చెరువులు, కుంటలను పరిరక్షించుకుని, అందులో చేపలు పెంపకం చేపట్టడం ద్వారా నీలి విప్లవం, గొర్రెల పంపిణీతో తద్వారా మాంసోత్పత్తి పెంచడం ద్వారా గులాబీ విప్లవం, పాల ఉత్పత్తులు పెంచడం ద్వారా క్షీర విప్లవం సాధించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. పాడిపంటలు సుభిక్షం చేయడానికి మన ముఖ్యమంత్రి కొత్త ఊపిర్లు ఊదుతున్నారని అన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతు సమన్వయ సమితుల లక్ష్యాలను స్వయంగా ముఖ్యమంత్రి ఇటీవల రాజేంద్రనగర్, కరీంనగర్ లలో జరిగిన రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులలో వివరించారని గుర్తు చేశారు.
అందరూ రైతు బిడ్డలే. కానీ అధికారంలో వచ్చాక అందరూ రైతులను ఇంతవరకు నిర్లక్ష్యం చేశారని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు అత్మ గౌరవం నిలిచేలా పని చేస్తున్నారని అన్నారు. గ్రామ, మండల, జిల్లా రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులు మొత్తంగా 1 లక్షా 61 వేల మంది ఉన్నారని, వారికి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని నియమించుకున్నామని అన్నారు. అందరికీ యూనియన్లు ఉన్నాయని, మన రాష్ట్రంలో మాత్రమే రైతుల కోసం సమన్వయ సమితులు ఉన్నాయని అన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడంమే ప్రభుత్వ లక్షమని అన్నారు. ఉచిత కరెంటు, సాగునీటి పెద్ద ఎత్తున పథకాలు, రెండు పంటలకు పెట్టుబడి, ప్రతీ 5వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారులు, మన రాష్ట్రంలోనే ఉన్నారని అన్నారు. రైతు సమన్వయ సమితులు ఎవరి మీద పెత్తనం చేయడానికి కాదని, పరస్పర సహకారంతో వ్యవసాయ, అనుబంధ రంగాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దడం మన లక్ష్యం కావాలని అన్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్, వ్యవసాయ మంత్రిగా నేను బండికి రెండు చక్రాలుగా పని చేసి రాష్ట్ర వ్యవసాయాన్ని ఉన్నత పథంలోకి తీసుక వెళ్ళాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోందని, రైతు సమన్వయ సమితి సభ్యులు అధికారులతో సమన్వయంతో పనిచేసి మనం అంతా రైతుల కష్టాలు తొలగించాలని అన్నారు. వచ్చిన పెద్దలు అందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.