
మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఉల్లి ధరలు పెరిగిపోవడంతో స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడి ఉల్లిని రైతుబజార్లలో రూ.20కే కిలో చొప్పున అమ్మాలని ఆదేశించారు. కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అమ్మాలని.. ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని మరోసారి వారు రాకుండా చూసుకోవాలని సూచించారు.
ఉల్లి కొరత దృష్ట్యా కర్నూలు, నాసిక్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉల్లిని కొనేందుకు అధికారులను పంపింది. నాణ్యమైన ఉల్లిని రైతుబజార్ల ద్వారా సరఫరా చేసేందుకు కొని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయనుంది..