Breaking News

ప్రశ్నించిన రైతును పిచ్చోడన్న కేసీఆర్..?

00hsb

హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతం. సాగునీటి వసతి లేదు. వానలు పడితే పంటలు పండుతాయి. లేకపోతే ఎండుతాయి.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి నీళ్లిచ్చేందుకు ఎస్సారెస్పీ వరద కాలువను తవ్వించారు. ఆ నీటితో హుస్నాబాద్ పట్టణానికి సమీపంలోని తోటపల్లి గ్రామం వద్దనున్న చెరువును రిజర్వాయర్ గా మార్చి నీరు నింపాలన్నది ప్లాన్. ఎస్పారెస్పీ నీటితో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్ ఈ ప్రాజెక్టు మంజూరు చేయించారు.

తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వైఎస్ ప్రభుత్వం రూ.2 కోట్ల 56 లక్షలు కూడా వెచ్చించింది. పనులు ఆలస్యంగా చేయడంతో కాంట్రాక్టును రద్దుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. మంత్రి హరీష్ మూడు నెలల క్రితం తోటపల్లి రిజర్వాయర్ సందర్శించి పరిశీలించారు. హామీ ఇచ్చి వదిలేశారు..

ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు హరితహారం కార్యక్రమంలో హుస్నాబాద్ కు వచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా సిద్దిపేటకు నీరు తరలిస్తానని.. హుస్నాబాద్ గుండానే ఆ నీరు వెళుతుంది కాబట్టి ఇక్కడి రైతులకు నీరిస్తానని సారూ స్కెచ్ వేశారు. అందుకే హుస్నాబాద్ కు కాళేశ్వరం నీరు ఇస్తానని నిన్న బహిరంగ సభలో  చెప్పారు.

కానీ హుస్నాబాద్ ప్రాంత రైతు ముస్కు మహిపాల్ రెడ్డి దీనిపై కేసీఆర్ ను ప్రశ్నించాడు. ‘తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లివ్వచ్చు కదా’ అని.. దీనికి అగ్గిమీద గుగ్గిలం అయిన కేసీఆర్ సారూ.. ‘ఏయ్ .. అరవకు.. పిచ్చోడివా.. నీకే బాగా తెలుసా.. నాకు తెలియదా.. బుద్దిందా అడిగేందుకు తోటపల్లి కడితే నీళ్తు తెస్తావా..?’’ అంటూ రైతుపై విరుచుకుపడ్డాడు..

కోట్లు ఖర్చుపెట్టి నిర్మాణంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్ ను కాదని ఎక్కడో కాళేశ్వరం ఎత్తిపోతల నీళ్లు ఇస్తాడట సారూ.. ‘కాళేశ్వరం ఇంకా డిజైన్ కాలేదు.. ప్రాజెక్టు మొదలే కాలేదు.. మళ్లీ పుష్కరం వచ్చినా పూర్తవుతుందో తెలీదు.. అక్కడి నుంచి కరువు ప్రాంతం హుస్నాబాద్ కు నీళ్లిస్తాడట.. జనాల చెవుల్లో పెద్ద పూలు పెడుతుండు సారూ.. ఉన్నది పూర్తి చేసి ఇవ్వక.. లేనిదానికోసం పరిగెడుతున్నాడు.. అడిగినోళ్లను పిచ్చోళ్లను చేస్తున్నాడు.

కేసీఆర్ ను ప్రశ్నించినందుకు రైతును పోలీసులు పట్టుకుపోవడం ఇక్కడ కొసమెరుపు..

కేసీఆర్ సారూ.. సిద్దిపేటకు నీళ్లివ్వడానికి హుస్నాబాద్ వయా మాత్రమేనని మాకు తెలియదా ఏంటీ?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *