రైతు ఆత్మహత్యపై దద్దరిల్లిన పార్లమెంటు

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు సంఘటనపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి.  విపక్షాలు ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించాయి.

దీనిపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్య విచారకరమని.. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. రైతుల స్థితిగతులను మెరుగుపర్చేందుకే ప్రభుత్వం సంస్కరణలు చేస్తున్నదని తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణ దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు.

అనంతరం మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఆత్మహత్యలు దేశానికి చాలా పెద్ద లోటు అని.. వారి సౌభాగ్యం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రైతు ఆత్మహత్య తనను కలిచివేసిందని ప్రధాని అన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *