రైతుల విషయంలో బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటాం: హరీష్ రావు

రైతులకు చెల్లింపుల్లో జాప్యాన్ని సహించను.

మధ్య దళారుల జోక్యాన్ని నిర్మూలించాలి.

రీసైక్లింగ్ పై చర్యలు తీసుకోవాలి.

-మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్సు.

మక్కలు, సోయాబీన్, ధాన్యం తదితర పంటలు  అమ్మిన రైతులకు చెల్లింపులలో జాప్యాన్ని సహించేది లేదని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్, మార్క్ ఫెడ్, ఇతర  శాఖల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శుక్రవారం నాడు సెక్రెటేరియట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్ ఫెడ్, హాకా తదితర సంస్థల అధికారులతో ఆయన వీడియో  కాన్ఫరెన్సు నిర్వహించారు.షాద్ నగర్  వ్యవసాయ మార్కెట్ ను రెండు రోజుల క్రితం తాను సందర్శించినప్పుడు  మార్కెటింగ్, మార్కెఫెడ్ సిబ్బందిపై రైతులు ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ మార్కెట్ లో 4 కోట్ల,83 లక్షల విలువ చేసే మక్కలు కొని కేవలం 66 లక్షలు చెల్లించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. మక్కల కొనుగోలు కోసం  మార్క్ ఫెడ్ కు ప్రభుత్వం   500 కోట్లు సమకూర్చినా రైతులకు చెల్లింపుల్లో బాధ్యతా రాహిత్యంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  ఈ ధోరణి సహించరానిదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 284 కోట్ల విలువైన మక్కలు కొనుగోలు చేసి ఇంకా 100 కోట్లు చెల్లింపులు పెండింగులో  ఉండగా  రెండు  రోజుల్లోనే  50 కోట్లను చెల్లించే ప్రక్రియ ప్రారంబించారని చెప్పారు.మక్కలు,కందులు, ధాన్యం, పెసలు,మినుములు, పత్తి.. తదితర పంట దిగుబడులు మార్కెట్ కు రాగానే కొన్న వెంటనే 72 గంటలలోపు రైతులకు పేమెంట్ ఇవ్వాలని  ఆదేశించారు.

రైతులకు వేగంగా చెల్లించాలనే  ఆదేశాలు ఖాతరు చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు హెచ్చరించారు.పత్తికి  అంతర్జాతీయంగా  మంచి డిమాండ్ ఉన్నందున రైతులు తక్కువ ధరకు అమ్మరాదని హరీశ్ రావు సూచించారు.సకాలంలో చెల్లింపులు జరపకపోవడం,లేదా నెలకు పైగా చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం వంటి కారణాలతో రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నట్టు మంత్రి తెలిపారు.లారీలు అందుబాటులో లేవనే సాకుతో కొనుగోలు చేసిన సరుకును గోడౌన్ లకు తరలించకపోవదాన్ని హరీశ్ రావు తప్పు పట్టారు. లారీల కొరతను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకు వెళితే మోటార్ వెహికిల్  ఇన్స్ పెక్టర్ లతో మాట్లాడి లారీలను సమకూర్చుతారని మంత్రి హరీశ్ రావు చెప్పారు.పలు జిల్లాల్లో సోయాబీన్ కొనుగోళ్ళకు సంబంధించిన పేమెంటు చెల్లింపులు పెండింగ్ లో ఉన్న విషయాన్ని మంత్రి ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారుల దృష్టికి తెచ్చారు. వరంగల్ లో పత్తి,మరికొన్ని చోట్ల మక్కల రైతులకు చెల్లింపులు జరగలేదన్నారు. వీటన్నిటినీ యుద్ధప్రాతిపదికన చెల్లించాలని హరీశ్ రావు ఆదేశించారు.ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో లైసెన్సు లేకుండా కొందరు వ్యాపారులు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం అటువంటి వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిన్నింగ్ మిల్లులలో రకరకాల పేర్లతో సామాన్య రైతులను పిండుకుంటున్నట్టు తనకు ఫిర్యాడులోస్తున్నాయని అలాంటి మిల్లులపై చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఆదేశించారు.కొన్ని చోట్ల తక్కువ రేటుకు మక్కలు కోని  మార్కెట్లలో ఎక్కువ రేటుకు  రీసైక్లింగ్ చేస్తున్నారని ఇలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఆదేశించారు.మధ్య దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ గోదౌన్లు పుష్కలంగా ఉన్నందున ప్రైవేటు గోదాములను ప్రోత్సహించరాదని మంత్రి ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్సులో వ్యవసాయ శాఖ  సెక్రెటరీ పార్ధసారధి,వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్ మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి, జాయింటు డైరెక్టర్ లక్ష్మణుడు తదితర అధికారులు  పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *