
గన్నవరం నియోజకవర్గ రైతుల అభివృద్ధి కోసం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ విశేషంగా కృషి చేస్తున్నారని ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఉంగుటూరు మండలం గారపాడు గ్రామంలో 200 మెట్రిక్ టన్నుల గిడ్డంగి ప్రారంభోత్సవం, కొయ్యగూరపాడు గ్రామంలో 100 మెట్రిక్ టన్నుల గిడ్డంగి శంకుస్థాపన కార్యక్రమాలలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సొంత నిధులతో రైతులకు మోటర్లు ఇచ్చి వారి ఆర్ధికసర్వముఖాభివృద్ధికి ఎమ్మెల్యే వంశీ తీవ్రంగా కృషిచేశారని తెలిపారు. శాసనసభ్యులు వంశీ మాట్లాడుతూ కోరిన వెంటనే గిడ్డంగుల మంజూరుకు కృషిచేసిన ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల జీవనప్రమాణాల పెంపుదలకు నిరంతరం కృషిచేస్తానని ఎమ్మెల్యే వంశీ స్పష్టం చేశారు.