రైతుల కోరిక మేరకే చెక్కులు ఇస్తున్నాం : మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

పంట పెట్టుబడి పథకం లో నగదును రైతులకు ఏవిదంగా చేర్చాలనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా 551 మండలాలలోని 624 గ్రామాలలోని 62,377 మంది రైతుల నుండి అభిప్రాయాలను, సూచనలను సేకరించడం జరిగింది. చెక్కుల ద్వారా పంపిణీకి మెజారిటీ రైతులు మొగ్గు చూపారు. రైతుల అభిప్రాయాలను తుది నివేదిక రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ప్రతి సీజన్ లో రైతులకు ముందస్తు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4000 అందివ్వాలనే పథకంలో నగదు బదిలీ అంశంపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ రెండవ సమావేశం ఈరోజు సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ టి. హరీష్ రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజెందర్, విధ్యుత్తు శాఖ మంత్రి శ్రీ గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సమావేశానంతరం మీడియాతో మంత్రి పొచారం….

వచ్చే వానాకాలం నుండే ముందస్తు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4000 ఇచ్చే పంట పెట్టుబడి పథకం అమలు చేస్తాం.

రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలను రైతులకు గ్రాంటుగా ఇవ్వడం దేశంలోనే ఇదే మొదటిసారి.

మరే రాష్ట్రం కూడా ఇంత సాహసం చేయకపోవచ్చు.

పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసి ఇబ్బందుల పాలుకాకూడదన్నదే ప్రభుత్వ ఆశయం.

రెవిన్యూ రికార్డు ప్రక్షాళన తర్వాత కేటగిరి ఎ క్రింద రాష్ట్రంలో 71 లక్షల 75,000 మంది రైతు ఖాతాలు, 1.42 కోట్ల
ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు లెక్క తేలింది.

కమిటీ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో సభలు,  సమావేశాల ద్వారా రైతుల సూచనలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు

ప్రభుత్వం ఇచ్చే ఈ పంట పెట్టుబడి పథకం నగధు నేరుగా రైతులకు చేర్చాలన్నదే లక్ష్యం.

సాగుకు యోగ్యం కాని భూములను ఈ పథకం పరిది నుండి తొలగించాలని కమిటీ సభ్యులు సూచించారు.

రాష్ట్రంలోని రైతులందరికి ఈ పథకాన్ని అమలు చేస్తాం.

 ఎకరాలపై పరిమితి లేదు. 97.2 శాతం మంది రైతలు 10 ఎకరాల లోపే ఉన్నారు.

ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సమర్ధవంతంగా అమలుచేస్తాం.

రైతులకు అవసరమైనంతమేర నగధు నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని బ్యాంకులను కోరాం.

ఈపథకం  అమలు తర్వాత బ్యాంకులలో  నగదు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

త్వరలోనే రాష్ట్ర ఆర్ధికమంత్రి నేతృత్వంలో డిల్లీ వెళ్ళి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రిని, RBI అధికారులను కలిసి
రైతులకు అవసరమైనంత నగధును సరఫరా చేయాలని కొరుతాం.

తుది నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తాం.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ,  వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్ధసారది , ఆర్ధిక శాఖ
ముఖ్య కార్యదర్శి రామకృష్ణ , TSCAB చైర్మన్ కొండూరు రవీందర్ రావు, SLBC కన్వీనర్ మణికందన్,CGM
(పోస్టల్ డిపార్ట్ మెంట్) ఎలీషా, ఉధ్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామి రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు
పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *