రైతుల కష్టాలు తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి : మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి

కెసిఆర్ గారు దేశంలో ఎవరు అమలు చేయనన్ని పథకాలను రాష్ట్రంలో వ్యవసాయ రంగం కోసం అమలు చేస్తున్నారు. దీనితో రైతులకు భరోసా వచ్చింది. ఇది మా ప్రభుత్వం అని రైతులు భావించుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.

బుధవారం శాసనమండలిలో “భూరికార్డుల ప్రక్షాళన- పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ మరియు రైతులకు ఎకరాకు రెండు పంటలకు రూ. 8000 లు పెట్టుబడి”పై  జరిగిన “స్వల్పకాలిక చర్చ” లో మంత్రి మాట్లాడుతూ రైతాంగ శ్రేయస్సు కోసం దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలో ఇంత దైర్యంగా ఇన్ని పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన కెసిఆర్ గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాష్ట్ర జనాభాలో 80 శాతం ఉన్న పేదలు, 70 శాతం ఉన్న రైతుల సంక్షేమమే తమ ద్యేయమని ప్రకటించారు. ఆప్రకారమే ఈ రెండు అంశాలపై అత్యధిక నిధులను కెటాయిస్తున్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో వేసవి కాలం వచ్చిందంటే కరెంటు కోతలతో ప్రతి గ్రామంలో ధర్నాలు, రాస్తారొకోలు జరిగేవి. మరోవైపు సాగునీటి కోసం కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా రాష్ట్రంలోని బీడు భూములకు సాగునీరందించడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు పెట్టుబడిగా ప్రతి ఎకరాకు రూ. 8000 అందించడం అత్యంత గొప్పది. ఈ పథకానికి “రైతు బంధు పథకం” అని పేరు పెట్టాం. సీజన్ మొదలు కాగానే పెట్టుబడి కోసం రైతులు ప్రవేటు వ్యాపారులను ఆశ్రయించకుండా వారికి కావలసిన విత్తనాలు, ఎరువుల ఖర్చుల కోసం ప్రభుత్వమే గ్రాంట్ గా నిధులను సమకూర్చుతున్నది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా కసరత్తు చేసింది. ముఖ్యంగా 80 ఏళ్ళ తర్వాత తిరిగి రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. రాష్ట్రంలో మొత్తం 1,62,45,150 సర్వే నెంబర్లు ఉండగా 1,49,52,436 సర్వే నెంబర్లను (92 %) ప్రక్షాళన చేయడం జరిగింది. అన్ని సవ్యంగా ఉన్న భూముల వివరాలను పార్ట్-A లో చేర్చి, మిగితా వాటిని పార్ట్-B లో చేర్చడం జరిగింది. పార్ట్-A లో ఉన్న భూములకు ప్రతీ సీజన్ కు ఎకరాకు రూ. 4000 ను ఈ వానాకాలం నుండే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ భూముల వివరాలను రెవిన్యూ శాఖ నుండి వ్యవసాయ శాఖ కు బదిలీ చేయడం ప్రారంభమయింది. ఇప్పటికే 7000 గ్రామాల డేటాను వ్యవసాయ శాఖ కు పంపారు. ఈ సమాచారాన్ని సమీక్షించి బ్యాంకులకు పంపుతున్నాం. మొత్తం 6 బ్యాంకులకు చెక్కుల ముద్రణ బాద్యతను అప్పగించాం. ప్రతీ చెక్కు మీద “రైతు బంధు ” పథకం పేరు ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ చెక్కులను వానాకాలం కోసం ఎప్రిల్ 15 నుండి మే 20 లోపు, యాసంగి సీజన్ కోసం నవంబర్ 20 నుండి పంపిణీ చేస్తాం. చెరకు పంట కాలం 12 నెలలు కావున రూ. 8000 అందచేస్తాం. ఉద్యాన పంటలైన పండ్ల తోటలకు కూడా రూ. 8000 అందుతాయి. విత్తనోత్పత్తి రైతులకు కూడా రైతు బంధు పథకం వర్తిస్తుందని మంత్రి గారు తెలిపారు. అదేవిదంగా గిరిజనుల భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు కూడా రైతు బంధు పథకం వర్తింపచేయడానికి సంబందిత జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రయత్నిస్తామని మంత్రి పొచారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత చర్యలతో 2014 కు ముందుతో పోల్చి చూస్తే గత నాలుగేళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులలో భరోసా కల్పించి, వారి కష్టాలు దూరం చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవడమేనని మంత్రి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.