రైతుల ఉసురు పోసుకోవద్దంటూ విపక్షాలపై విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు

 

 

నల్లగొండలో సుడిగాలి పర్యటన

 

కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి లు రైతుల ఉసురు పోసుకుంటున్నాయని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలని కోరుతున్న కాంగ్రెస్ ను గ్రామాల్లో రద్దు చేయాలని హరీశ్ రావు  పిలుపునిచ్చారు.

కోర్టులను ఆశ్రయించి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కాకుండా అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలన్నారు. గురువారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన సుడిగాలి పర్యటన జరిపారు.నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. నల్లగొండ, మునుగోడు తదితర ప్రాంతాల్లో మంత్రి హరీశ్ రావుకు ఘన స్వాగతం లభించింది. భారీ ర్యాలీ లు నిర్వహించారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు.కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేస్తున్న రైతులను పిట్టల్లా కాల్చిన  టిడిపి, కరెంటు, ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా రైతులను హింసించిన కాంగ్రెస్,రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన బిజెపిలకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సంఘముందని, రైతులకు కూడా ఒక సంఘం ఉండాలనే సదుద్దేశంతో రైతు సమన్వయ సమితు లకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. దేశానికి వెన్నెముక అయిన రైతులను సంఘటితం చేసే మహత్తర కార్యక్రమం అమలు కానుందన్నారు. రైతును నిర్ణాయక శక్తిగా మార్చబోతున్నట్టు హరీశ్ రావు తెలిపారు. ఏ వస్తువు తయారు చేసే వారైనా ధరను అతనే నిర్ణయిస్తాడని భూమిని తలకిందులు చేసి బువ్వ పంచే రైతులకు మాత్రమే ఆ స్వేచ్ఛ లేదన్నారు. రైతు సమన్వయ సమితులు ఏర్పడితే తన పంటకు తానే ధర నిర్ణయించుకుంటాడని ఇరిగేషన్ మంత్రి అన్నారు. రైతులు శక్తి మంతులవుతారని చెప్పారు. రైతు సమన్వయ సమితి కి కులం,మతం ఉండదని రైతులను కష్టాల్లో ఆదు కుంటుందని అన్నారు.విపక్షాలు తమపై కోపముంటే రాజకీయంగా తమతో పోరాడాలని హరీశ్ రావు చెప్పారు. రైతు సమన్వయ సమితి కి అడ్డు పడి రైతుల నోట మట్టి కొట్టవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.రైతుల సంక్షేమం తమ ప్రాధాన్యత అని అన్నారు.గతంలో చంద్రబాబు, వైఎస్ లు యాత్రలు చేశారు తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని హరీశ్ రావు విమర్శించారు. జిల్లాల వారీగా ఇరిగేషన్ రంగంలో టీఆరెస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని మంత్రి మునుగోడు సభలో వివరించారు.

ఫ్లోరైడ్ భూతం కోరల నుంచి మునుగోడు నియోజకవర్గం విముక్తి కావాలంటే,

ప్రజలకష్టాలు తీరాలంటే కృష్ణా నీళ్లు రావాలని మంత్రి తెలిపారు.డిండి ఎత్రిపోతల పథకం పూర్తి చేద్దామంటే  కాంగ్రెస్ వాళ్ళు  కోర్టులో కేసులుపెడుతున్నారని విమర్శించారు.

శివన్నగూడెం ప్రాజెక్ట్ వద్ద టెంట్లు వేయించి ధర్నాలు చేపిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం పేరిట స్టార్ట్ చేసిన 34 ఒక్క ప్రాజెక్ట్ లలో ఒక్కటీ కూడా పూర్తి చేయలేదన్నారు.డిండి పథకం కింద భూములు

కోల్పోయిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ట్టు తెలిపారు.భూ నిర్వాసితులకు బ్రోకర్ లు లేకుండా నేరుగా నష్ట పరిహారం అందజేస్తామని,

న్యాయం చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

నల్లగొండ జిల్లాలో ఏ. ఎం.ఆర్.పి లోలెవల్ కెనాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జానారెడ్డి “ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్”అని కామెంట్ చేశారని అయితే మూడు రోజుల క్రితమే పూర్వ ఖమ్మం జిల్లాలో 45 వేల ఎకరాలను సాగులోకి తీసుకు వచ్చే ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. పాలెంవాగు నుంచి 10 వేల ఎకరాలు, కిన్నెర సాని నుంచి 10 వేల ఎకరాలకు,పాలేరు పాత కాల్వను ఆధునీకరించి 25 వేల ఎకరాలకు సాగునీటి సరఫరా చేసినట్టు తెలియజేశారు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో గత యేడాది 4.50.లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. ఈ సంవత్సరం 6.50 లక్షల ఎకరాలకు సాగునీరివ్వనున్నట్టు ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని హరీశ్ రావు గుర్తు చేశారు. ఆదిలాబాద్ లో గొల్లవాగు, మత్తడి వాగు,ర్యాలీ వాగు ప్రాజెక్టు లు పూర్తి చేశామని చెప్పారు. నిజామాబాద్ లో చౌటపల్లి హనుమంథరెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేసినట్లు తెలిపారు.మిషన్ కాకతీయ  కార్యక్రమంలో గత యాసంగిలో 16 లక్షల ఎకరాలకు చెరువుల ద్వారా సాగునీటిని అందించామని మంత్రి తెలిపారు.

నెలరోజుల్లో నల్గొండ బత్తాయి మార్కెట్ పూర్తి చేస్తామని మార్కెటింగ్ మంత్రి ప్రకటించారు.

దొండ, నిమ్మ మార్కెట్లు సైతం రెండు, మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పూర్వ నల్లగొండ

జిల్లాలో గతం  కంటే 20 రెట్ల స్థాయిలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు నిర్మించామని చెప్పారు.వచ్చే

జనవరిలో బ్రాహ్మణ వెల్లెంల   రిజర్వాయర్ లోకి ఉదయ సముద్రం నీళ్లు పారిస్తామని హరీశ్ రావు  చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో కరెంటు కావాలని ఆందోళనలు జరిగాయని, ఇపుడు తగ్గించమని కోరుతున్నరు అని

నల్లగొండ రైతు బజార్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు అన్నారు.

73 లక్షలతో రైతు బజార్ ప్రారంభోత్సవం చేసుకోవడం  సంతోషంగా వుందని

అన్నారు‌.నల్లగొండ పట్టణంలో గతంలో వెయ్యి మెట్టిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు ఉంటే.. టీఆరెస్ ప్రభుత్వం 10వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మించిందన్నారు. జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను గత మూడేళ్ల కాలంలో నిర్మించామని తెలిపారు. జిల్లాలో బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్లు నిర్మాణం జరుగుతోందన్నారు. రెండు, మూడు నెలల్లో ఆ రెండు మార్కెట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు.  రైతులు 12’గంటల కరెంటును కోరుకుంటున్నారని చెప్పారు.

దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉదయ సముద్రం లిఫ్టిరిగేషన్ స్కీమ్ ని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు .

జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని హరీశ్ రావు చెప్పారు.

నల్గొండ పట్టణంలో రైతు బజార్ ను  ప్రారంభించిన అనంతరం నిర్మాణం లో ఉన్న బత్తాయి మార్కెట్ ను తనిఖీ చేశారు.  నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన కనగల్ సబ్ మార్కెట్ దగ్గర నాబార్డ్  గో డౌన్ ను ప్రారంభించారు. మునుగోడు మండలం గూడాపూర్ గ్రామంలో 33/11 కె.వి.సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. మునుగోడు-చండూరు రోడ్డు వెడల్పు చేసే పనులకు శంకుస్థాపన చేశారు. చండూరు మార్కెట్ కమిటీకి అనుబంధంగా ఉన్న మునుగోడు సబ్ మార్కెట్ దగ్గర నాబార్డు గో డౌన్ ను ప్రారంభించారు.  చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నాబార్డు గోడౌన్ ను  ప్రారంభించారు.వలిగొండ మండలం

రామన్నపేట సబ్ మార్కెట్ కమిటీ దగ్గర నాబార్డు గో డౌన్ ను ప్రారంభించారు. వలిగొండ వ్యవసాయ మార్కెట్ లో గోడౌ న్ ను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ఆలేరు మార్కెట్ కమిటీలో గో డౌన్ ను ప్రారంభించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.