రైతులు సేంద్రీయ ఎరువులనే వాడాలి

కరీంనగర్ (పిఎప్ ప్రతినిధి): రైతులు సేంద్రీయ ఎరువులతో పంటలను సాగుచేసి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ర్ట ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. జమ్మికుంటలోని ప్రకాశం కృష్ణ విజ్ఞాన కేంద్రంలో కిసాన్ సమ్మేళనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా కిసాన్ మేళను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కెవిఆర్లో రైతుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోఫ్రీ నెంబర్ 18004253377ను మంత్రి ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల నుంచి రైతులు పైసా ఖర్చు లేకుండా తమ సమస్యలపై సలహాలు సూచనలు పొందవచ్చని అన్నారు. లక్ష రూపాయల వరకు రుణాన్ని తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తూ బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసినా కొందరు బ్యాంకర్లు వడ్డీ, పెనాల్టీలు వసూలు చేస్తున్నారని అలాంటి బ్యాంకర్లతో లావాదేవీలు నిలుపుదల చేయనున్నట్లు మంత్రి హెచ్చరించారు. దేశానికి వెన్నెముక రైతు అని, రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెట్టే రైతును ఆదుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందని మంత్రి అన్నారు. రైతులు తమ ఉత్సత్తులను తామే అమ్ముకునుటకు అదే విధంగా అధిక లాభాలు పొందుటకు నాబార్డు సహాయం పొందాలని మంత్రి రైతులకు సూచించారు. అనంతరం ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, వ్యవసాయేతరాల్లో శిక్షణ పొంది నాణ్యతతో అధిక దిగుబడులు సాధించిన ఉత్తమ రైతులకు మంత్రి ఈటెల రాజేందర్ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కెవిఆర్ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి, సెక్రటరీ సత్యనారాయణ, చీఫ్ సెక్రెటరీ డాక్టర్ కె దత్తాత్రేయ, జెడి అగ్రికల్చర్ శత్రు నాయక్, జెడి పశుసంవర్థక శాఖ రాంచంద్ర నాయక్, నగర పంచాయతీ కమిషనర్ శ్రీకాంత్, చైర్మన్ పి రామస్వామి, ఎడి దామోదర్ రెడ్డి, జడ్పిటిసి వీరేశం, కెవి మాజీ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి, ఎంపిపి లత, ప్రభుత్వ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *