రైతులను దగా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

రైతులను దగా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నియామకాలు చేపట్టకపోగా… నీళ్ల కేటాయింపు విషయంలోను జిల్లాల మధ్య చిచ్చుపెడుతూ రైతులను దగా చేస్తున్నారని టీ టీడీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఉంటే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాగునీటి పేరుతో అక్రమంగా పాలేరుకు సాగర్ జలాలు తరలించుకుపోతూ నల్గొండ జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. న్యాయబద్ధంగా నల్గొండ జిల్లాలకు రావాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని కోదాడ, హుజూర్ నగర్,
మునగాల ఆయకట్టు రైతులు రోడ్డమీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. రైతులు ఆందోళనలు జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి కరువు పరిస్ధితులతో అల్లాడుతున్న నల్గొండ రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు న్యాయమైన వాటా వచ్చేవరకు అఖిలపక్షం తరపున పోరాటం చేస్తామన్నారు. సాగర్ ఎడమ కాలువ 5వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల చేస్తే మునగాల సమీపంలోని ముత్యాల బ్రాంచ్ కెనాల్ కు వచ్చేసరికి 3,150 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. అందులో 2,150 క్యూసెక్కుల నీటిని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఒత్తిడితో అధికారులు పాలేరుకు
తరలిస్తున్నారు. మిగిలిన వెయ్యి క్యూసెక్కుల నీటిని మాత్రమే ముత్యాల బ్రాంచ్ కెనాల్ కు విడుదల చేస్తూ నల్గొండ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *