
ప్రభుత్వం ప్రకటించినట్లుగా రాష్ట్ర రైతాంగానికి ముందస్తు పెట్టుబడిగా ప్రతి సీజన్ కు ఎకరాకు రూ. 4000 ను ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు చేర్చాలనే అంశంపై విధానాలను రూపొందించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినేట్ సబ్ కమిటి సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది.
పొచారం కామెంట్స్…
దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది.
రెవిన్యూ రికార్డు ప్రక్షాళన తర్వాత కేటగిరి ఎ క్రింద రాష్ట్రంలో 71 లక్షల 75,000 మంది రైతు ఖాతాలు ఉన్నట్లు లెక్క తేలింది.
మొదటి సమావేశంలో అందరి అభిప్రాయాలను తీసుకున్నాం.
కమిటీ సభ్యులం గ్రామాలలో సభలు, సమావేశాల ద్వారా రైతులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలసుకుంటున్నాం.
జనవరి 10 వ తారిఖున మరోసారి సమావేశం అవుతాం.
ప్రభుత్వం ఇచ్చే ఈ పంట పెట్టుబడి పథకం నగధు నేరుగా రైతులకు చేరాలన్నదే లక్ష్యం.
ప్రస్తుతం రైతులకు ఉన్న బ్యాంకు ఖాతాలోనే ఈ నగదును జమచేసినట్లయితే పాత బకాయిల క్రింద జమకడతారని రైతులు అనుమానం వ్యక్తం చేయడం సహాజం, దీనికై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అభిప్రాయాన్ని అడిగాం వారు మరుసటి సమావేశంలో చెబుతామన్నారు.
అందరి అభిప్రాయాలను, సలహాలను పరిగణలోకి తీసుకోని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, టి.హరీష్ రావు, ఈటెల రాజేందర్, కెటిఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్ధసారది IAS, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణ IAS, వ్యవసాయ శాఖ కమీషనర్ యం.జగన్మోహన్ IAS, TSCASB చైర్మన్ కొండూరు
రవీందర్ రావు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతినిధులు, CGM-పోస్టల్ డిపార్ట్ మెంట్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.