రైతులకు పంట నష్ట పరిహరం చెల్లిస్తాం;మంత్రి బండారు దత్తాత్రేయ

ఏప్రిల్ 15, కరీంనగర్; తెలంగాణలో పంట నష్ట పోయిన రైతులకు పరిహరం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మాట్లాడుతూ కేంద్రం ఏప్రిల్ 1 నుంచి నష్ట పరిహారాన్ని పెంచిందని తెలిపారు. గతంలో 50 శాతం పండ్లు నష్టపోయిన వారికి పరిహారాన్ని ఇస్తున్నారని అన్నారు. దానిని 33 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. పంట తోటలకు 12 వేల నుండి 18 వేలకు, ఉద్యానవన పంటలకు 4500 నుండి 6800 వరకు, నీటీ పారుదల ద్వారా సాగు చేసే పంటలకు 9000 వేల నుండి 13 వేలకు పెంచినట్లు తెలిపారు. పశుసంపద నష్ట పోతే 16400 రూ.లనుండి 30 వేల కు పెంచినట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు 1600 రూ.ల నుండి 3000 రూ.లు చెల్లించనున్నట్లు తెలిపారు. పోలంలో ఇసుక మేట వేసినట్లయితే తోలగించడానికి 8100 రూ.ల నుండి 12000 రూ.ల వరకు పెంచినట్లు తెలిపారు. చేనేత పనివారికి ముడి సరుకు కోనుగోలుకు రూ.లు 3000 నుండి 4200 రూ.లు పెంచినట్లు తెలిపారు.ఏప్రిల్ 1 నుండి నూతన విధానం అమలులోకి వస్తుందని

తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతన విధానం ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సూచించారు. రాలిపోయిన మామిడి పండ్లను కూడా పరిగణలోకి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. పంట భీమా పథకం ద్వారా రైతులకు అధిక లాభం చేకురుతుందని అన్నారు. తెలంగాణ రాష్ఠ్రాలలో లక్ష హెక్టార్లు, కరీంనగర్ లో 20 వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై, కరంటు, నీరు సమస్యల వలన ప్రకృతి వైపరీత్యాల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ భాద్యతఅని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *