విజయవాడ, ప్రతినిధి : రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం తుళ్లూరు గ్రామంలో సీఎం బాబు పర్యటించారు. అక్కడున్న రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. చంద్రబాబు అక్కడున్న వారిని నచ్చచెప్పేందుకు బాబు ప్రయత్నించారు. భూములిచ్చే రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనని, అందుకోసమమే అత్యుత్తమైన ప్యాకేజీనివ్వడం జరిగిందన్నారు. మీరందరూ ఐక్యంగా ఉండాలని, రైతులు లాభ పడితే నాకు అదే సంతోషమని బాబు పేర్కొన్నారు. వేయి సంవత్సరాల పాటు రాజధానిని గుర్తు పెట్టుకోవాలని ఆకాంక్షించారు.